Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వడ్డీ రేట్లు పెంపు..!

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రూ.3 కోట్ల లోపు రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDలు)పై, ఎంపిక చేసిన మధ్యకాలిక, దీర్ఘకాలిక కాలపరిమితులలో వడ్డీ రేట్లను పెంచింది. ఈ సవరించిన రేట్లు నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు 500 రోజుల కాలపరిమితితో స్టార్ అక్షయ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అనే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ పథకం సాధారణ ఖాతాదారులకు సంవత్సరానికి 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది.

రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సంవత్సరానికి 6.60 శాతానికి పెంచింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ, మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై ఇప్పుడు 6.70 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 180 రోజుల నుంచి మూడు సంవత్సరాల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై, సీనియర్ సిటిజన్లు ప్రస్తుత రేటుపై అదనంగా 0.50 శాతం పాయింట్ల వడ్డీని పొందుతుండగా, సూపర్ సీనియర్ సిటిజన్లు అదనంగా 0.65 శాతం పాయింట్ల వడ్డీని పొందుతారు. రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు డిపాజిట్లపై, ఎంపిక చేసిన మెచ్యూరిటీ బకెట్‌లకు బ్యాంక్ రేట్లను కూడా సవరించింది.

BOI FD Rates

ఒక సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును సంవత్సరానికి 6.55%కి పెంచగా, ఒక సంవత్సరం కంటే ఎక్కువ, మూడు సంవత్సరాల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై 6.65% వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు కాలపరిమితిపై రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్న నాన్-కాల్‌బుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనంగా 0.15 శాతం పాయింట్ల వడ్డీ అందుబాటులో ఉంది. నాన్-కాల్‌బుల్ డిపాజిట్లపై గడువుకు ముందే డబ్బు ఉపసంహరించుకునే సౌకర్యం ఉండదు. ఎఫ్డీలపై రుణం, గడువుకు ముందే డబ్బు ఉపసంహరించుకునే సౌకర్యాలు కేవలం కాల్‌బుల్ డిపాజిట్లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కస్టమర్లు ఏదైనా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో లేదా BOI ఓమ్ని నియో మొబైల్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లను తెరవవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+