బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. హోమ్ లోన్, వెహికిల్ లోన్స్ పైన వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ వడ్డీ రేట్లను 0.35 శాతం నుండి 0.50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో వడ్డీ రేటు హోమ్ లోన్స్ పైన 6.85 శాతం నుండి 6.50 శాతానికి, వాహన రుణాలపై 7.35 శాతం నుండి 6.85 శాతానికి తగ్గింది. కొత్త వడ్డీ రేట్లు సోమవారం నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉంటాయి. కొత్త రుణాలు తీసుకునే వారికి, రుణం బదలీ చేసుకునే వారికి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు హోమ్ లోన్, వెహికిల్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజు కూడా రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది.
పండుగను దృష్టిలో పెట్టుకొని పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు హోమ్ లోన్ నుండి పర్సనల్ లోన్ వరకు వడ్డీ రేట్లను తగ్గించాయి.. తగ్గిస్తున్నాయి. ఇతర రుణాల వడ్డీ రేట్లతో పోలిస్తే హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు ఎప్పుడు తక్కువగా ఉంటాయి. గతంతో పోలిస్తే వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టానికి తగ్గాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో రియాల్టీ మాత్రమే కాదు.. అన్నింటా డిమాండ్ పడిపోయింది. ఓ వైపు ఆర్థిక రికవరీ కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరోవైపు పండుగ సీజన్ నేపథ్యంలో సేల్స్ పెంచుకోవడానికి, తద్వారా డిమాండ్ పెరగడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు వివిధ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తాయి. తాజాగా బజాజ్ ఫైనాన్స్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది.
ఈ మేరకు బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ ఇటీవల ఓ ప్రకటన చేసింది. హోమ్ లోన్ పైన వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు వడ్డీ రేటు 6.70 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. అంటే వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంది. రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారి క్రెడిట్ స్కోర్ బాగుంటే, ఆదాయానికి సంబంధించిన ప్రొఫైల్ కూడా బాగుంటే ఈ ప్రమోషనల్ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ రేటుతో వారి ఈఎంఐ నెలకు ప్రతి లక్ష రూపాయలకు రూ.645 మాత్రమే అవుతుంది.

నిబంధనల మేరకు రూ.5 కోట్ల వరకు కూడా రుణాన్ని పొందొచ్చును. ఈ వడ్డీ రేటు ప్రకారం ప్రతి రూ.1లక్షకు ఈఎంఐ రూ.645గా ఉంది. హోమ్ లోన్ తీర్చే కాలవ్యవధి అత్యధికంగా 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయ ప్రొఫైల్ కలిగిన దరఖాస్తుదారులకు 6.70 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు బజాజ్ ఫిన్ సర్వ్‌కు బదలీ చేసుకోవచ్చు. తద్వారా కూడా ఈ కొత్త వడ్డీ రేటు ప్రయోజనం పొందవచ్చునని బజాజ్ ఫిన్ సర్వ్ తెలిపింది. వడ్డీ రేటు తక్కువగా ఉండటంతో పాటు టాప్-అప్ లోన్ సౌకర్యం కూడా ఉంది.
ఈ హోమ్ లోన్ బదిలీ ప్రక్రియ త్వరగా, ఇబ్బందిలేకుండా, తక్కువ డాక్యుమెంటేషన్‌తో పూర్తవుతుంది. ఆసక్తి, అర్హులైన కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా బ్రాంచీ ద్వారా ఆఫ్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం ధరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్ ధరఖాస్తుదారు కాంటాక్ట్-ఫ్రీ-లోన్ అప్లికేషన్ నుండి ప్రయోజనం పొందుతారు. ఈ దరఖాస్తులో చివరి దశ మినహా మొత్తం ప్రాసెసింగ్ ఫోన్ కాల్ లేదా ఈ-మెయిల్ ద్వారా జరుగుతుంది. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ఈడబ్ల్యుఎస్ ఎల్ఐజీ హోమ్ రుణదారులకు వడ్డీలో రాయితీ ఉంటుంది.
రుణాన్ని తీసుకునేటప్పుడు, డాక్యుమెంట్స్ ప్రక్రియలో సంస్థ సిబ్బంది సేవలు ఇంటి వద్ద లభిస్తాయి. రుణగ్రహీత ఉద్యోగం చేసేవారయితే పబ్లిక్, ప్రయివేటు, బహుళజాతి కంపెనీల్లో కనీసం మూడేళ్లు ఉద్యోగ అనుభవం ఉండాలి. హోమ్ లోన్ పొందడానికి కనీసం 23 ఏళ్లు ఉండి, భారతీయుడై ఉండాలి. రుణం గడువు తీరిపోయే నాటికి గరిష్ట వయస్సు 62గా ఉండాలి. కనీస ఆదాయం రూ.30వేల నుండి రూ.50 వేలు ఉండవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications