చెక్కు చెల్లింపుల్లో జరిగే మోసాలను నివారించేందుకు పాజిటివ్ పే కన్ఫర్మేషన్‌ను తప్పనిసరి చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థను వచ్చే నెల(జూన్ 2021) నుండి అమలు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. ప్రాసెస్ చేయవలసిన చెక్కు వ్యాల్యూ రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు చెక్కు వివరాలను తప్పనిసరిగా మరోసారి నిర్ధారణ చేయాలని తన ఖాతాదారులకు తెలిపింది. పాజిటివ్ పే విధానంలో వివరాలను మరోసారి ధృవీకరించుకుంటారు. ఆ తర్వాతనే ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తారు.

రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో జారీ చేస్తే
రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో జారీ చేసే చెక్కులను నిర్ధారించుకోవచ్చు. మోడ్ ద్వారా ఒకసారి కన్ఫర్మేషన్ రిజిస్టర్ చేస్తే దానిని సవరించేందుకు గానీ, తొలగించేందుకు గానీ వీల్లేదు. నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సర్వర్‌కు ఒకసారి డేటాను సమర్పించిన తర్వాత దానిని తిరిగి సవరించేందుకు లేదా తొలగించేందుకు అవకాశం లేదు. బ్యాంకు కస్టమర్లు జారీ చేసిన చెక్కులు, పేమెంట్ చేయకముందు, సీటీఎస్ క్లియరింగ్ లేదా కౌంటర్ వద్ద ఏ సమయంలో అయినా నిలిపివేచ్చు.

నిత్యం అందుబాటులో
బ్యాంకు ఖాతాలో తగినంత అమౌంట్ ఉండటం, చెక్కు పైన సంతకం మొదలైనవి సరిపోలడంతో పాటు సీటీఎస్‌కు అందించిన వివరాలు, వాస్తవ చెక్కు వివరాలతో సరిపోలితే చెక్కు పాస్ చేస్తారు. ఏదైనా ఛానల్ లేదా మోడ్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల వరకు సమర్పించిన లేదా ధృవీకరించబడిన వివరాలు తదుపరి క్లియరింగ్ సెషన్లో పాస్ చేస్తారు. బ్రాంచీకి వెళ్లి నిర్ధారించే వారు ఆ బ్యాంకు బ్రాంచీ పని చేసే వేళలను అనుసరించి రిజిస్టర్ చేయాలి. ఇతర మోడ్స్ నిత్యం అందుబాటులో ఉంటాయి.

ఆ చెక్కులను అనుమతించరు
సక్సెస్ అయిన ప్రతి పాజిటివ్ పే కన్ఫర్మేషన్‌కు సంబంధించిన రిఫరెన్స్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వస్తుంది. చెక్కు ధృవీకరించినా లేకపోయినా కస్టమర్లు చెక్కు జారీ చేసే ముందు ఖాతాలా తగినంత మొత్తం ఉండేలా చూసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, బ్రాంచీని సందర్శించడం, ఎస్సెమ్మెస్, కాల్ సెంటర్ ఇందులో ఏదో ఒక విధానం ద్వారా కన్ఫర్మేషన్‌కు వివరాలు పంపించవచ్చు. కన్ఫర్మేషన్ కోసం వివరాలు పంపి మూడు నెలలు దాటిన చెక్కులను అనుమతించరు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications