High FD Rates: ఎఫ్‌డీలపై కొత్త ఏడాది శుభవార్త.. 1.25 శాతం ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న బ్యాంక్.. త్వరపడండి
Bank of Baroda News: డిసెంబర్ నెల చివర్లో దేశంలోని అనేక ప్రముఖ బ్యాంకులు పెట్టుబడిదారులకు చెల్లించే ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నూతన ఏడాది ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ బంపర్ ఆఫర్‌తో ముందుకొస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) తన కస్టమర్లకు కొత్త ఏడాదిలో పెద్ద బహుమతిని అందిస్తోంది. వివిధ కాలాలకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 1.25 శాతం వరకు గరిష్ఠంగా పెంచింది. దీనికి ముందు చివరగా అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది.

బ్యాంక్ తాజా ప్రకటన ప్రకారం రూ.2 కోట్ల లోపు వివిధ కాలలకు చేసే డిపాజిట్లపై వడ్డీ రేటును 0.01 శాతం నుంచి 1.25 శాతం వరకు పెంచింది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 29, 2023 నుంచి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రకటన ప్రకారం.. 7-14 రోజుల వ్యవధిలో గరిష్టంగా 1.25 శాతం పెరిగింది. ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును మూడు శాతం నుంచి 4.25 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే 15-45 రోజుల పూర్తి కాలానికి వడ్డీ రేటు ఒక శాతం పెరిగి 4.50 శాతానికి చేరుకుంది.
దేశంలో నవంబర్ నెలలో వ్యక్తిగత రుణాలు(Personal loans) తీసుకునే రేటు తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రుణాలపై RBI శిక్షాత్మక రిస్క్ బరువును విధించిన తర్వాత ఈ క్షీణత కనిపించింది. కొత్త వ్యక్తిగత రుణాల పంపిణీలో వృద్ధి రేటు నవంబర్‌లో 18.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో పర్సనల్ లోన్ కేటగిరీ సెగ్మెంట్ వృద్ధి రేటు 19.9 శాతంగా నమోదైంది.
స్టేట్ బ్యాంక్ ఇటీవల పెంచిన వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. 7-45 రోజుల డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా.. 46-179 రోజుల కాలానికి వడ్డీ 4.75 శాతం, 180-210 రోజుల మధ్య డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 5.75 శాతం, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలానికి ఆరు శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు కాలానికి 6.75 శాతాన్ని చెల్లిస్తోంది.


Click it and Unblock the Notifications