కస్టమర్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్, హోమ్ లోన్ వడ్డీరేటు 6.5%

హోమ్‌లోన్ కొనుగోలుదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) గుడ్ న్యూస్ చెప్పింది. గృహ రుణాలపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు గురువారం BoB ప్రకటించింది. దీంతో రుణరేటు 6.75 శాతం నుండి 6.5 శాతానికి దిగి వచ్చింది. తగ్గించిన వడ్డీరేట్లు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్‌లో తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అలాగే ఈ ప్రత్యేక వడ్డీరేటును మూడు నెలలు అంటే డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉండనుందని తెలిపింది. ఈ కొత్త వడ్డీరేట్లు కొత్తగా తీసుకునే రుణాలతో పాటు రుణాల బదిలీ లేదా పాత కస్టమర్లకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. దీంతోపాటు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు ఎత్తివేత ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఆఫర్ పొడిగింపు

ఆఫర్ పొడిగింపు

ఈ వడ్డీ రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి, లోన్ ట్రాన్సుఫర్ చేసుకునే వారికి, ఎగ్జిస్టింగ్ లోన్స్‌కు వర్తిస్తుందని తెలిపింది. హోమ్ లోన్స్ పైన ప్రాసెసింగ్ ఫీజు ఏమీ ఉండదని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ హోమ్ లోన్ ఇప్పటికే అందుబాటులో ఉందని, దీనిని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్‌లో తమ కస్టమర్లకు ఇది మంచి ఆఫర్ అని, వడ్డీ రేటు తగ్గడం వల్ల ఇంటి రుణ గ్రహీతలపై భారం తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్టగేజ్ అండ్ అదర్ రిటైల్ అసెట్స్ జీఎం హెచ్‌టీ సోలంకి అన్నారు.

హోమ్ లోన్ ఆఫర్లు

హోమ్ లోన్ ఆఫర్లు

దాదాపు అన్ని బ్యాంకులు కూడా పండుగ సీజన్‌లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం లోపు అందిస్తున్నాయి. భారత దిగ్గజ బ్యాంకులు ప్రస్తుతం వడ్డీరేటును పదేళ్ల కనిష్టానికి తగ్గించాయి. దీనికి తోడు హోమ్ బిల్డర్స్ ఇళ్లను, ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా రియాల్టీ దిగ్గజం కుదేలయింది. గత కొద్ది రోజులుగా కోలుకుంటోంది. ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభమైంది. దీంతో ఈ పండుగ సీజన్‌ను ఉపయోగించుకొని, డిమాండ్‌ను పెంపొందించేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ వడ్డీ రేట్లు తగ్గించడం, ఆఫర్లు ఇవ్వడం చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వివిధ కారణాలతో సొంతిళ్లకు డిమాండ్ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నందున విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. డిమాండ్‌ను మరింత పెంచేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ ప్రత్యేక వడ్డీ రేటు తగ్గింపు, ఆఫర్లు ఇస్తున్నారు.

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా, యస్ బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. పండుగ సందర్భంగా వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల నుండి 60 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాయి. దీంతో ప్రారంభ వడ్డీ రేటు ఏకంగా 6.5 శాతం నుండి 6.7 శాతం స్థాయికి పడిపోయింది. దశాబ్ద కాలంలో కనిష్ట వడ్డీ రేటు. కరోనా కారణంగా బ్యాంకుల బ్యాడ్ లోన్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు సెక్యూర్డ్ రుణాల కేటగిరీని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్బీఐ పెద్ద మొత్తంలో నగదును ఇండక్ట్ చేసిన తర్వాత వడ్డీ రేట్లు తగ్గాయి. పండుగ సీజన్‌లో ఎస్బీఐ ఫెస్టివెల్ ఆఫర్ కింద హోమ్ లోన్ వడ్డీరేటును 6.7 శాతానికే అందిస్తోంది. కొటక్ మహీంద్రా 6.5 శాతం, HDFC బ్యాంకు 6.7 శాతానికి, ఐసీఐసీఐ బ్యాంకు 6.7 శాతానికి, యస్ బ్యాంకు 6.7 శాతానికే అందిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+