For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంక్ ఆఫ్ బరోడా వేరబుల్ ప్రోడక్ట్స్, రూ.5000 వరకు చెల్లింపులు

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) సోమవారం నాడు వేరబుల్ ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేసింది. రూ.5 వేల వరకు చెల్లింపుల కోసం సరికొత్త వేరబుల్ ఉత్పత్తులను సోమవారం నాడు పరిచయం చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) బాగస్వామ్యంతో BOB వరల్డ్ వేవ్ ద్వారా ఈ వేరబుల్ ప్రోడక్ట్స్‌ను బ్యాంకు తీసుకు వస్తోంది. వచ్చే నెల నుండి బ్యాంకు కస్టమర్లకు వీటిని అందుబాటులోకి తీసుకు రావొచ్చు. వీటి కోసం అప్పటి నుండి ఆర్డర్ చేయాలి.

గ్యాడ్జెట్స్, ఉంగరాలు, వాచీల వంటి వాటికి BOB వేరబుల్ ప్రోడక్ట్స్‌ను అటాచ్ చేసుకోవాలి. దీంతో షాపింగ్ సమయాల్లో పీవోఎస్ మెషీన్ల పైన ఎలాంటి పిన్ నెంబర్ లేకుండా రూ.5 వేల వరకు చెల్లింపులు జరపవచ్చు. అయితే అంతకుమించిన పేమెంట్స్‌కు పిన్ నెంబర్ తప్పనిసరి.

Bank of Baroda launches wearable products for small ticket payments up to Rs 5,000

వచ్చే రెండేళ్ల కాలంలో ఈ పరికరాలపై స్మాల్ టిక్కెట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్‌లో పది శాతం వరకు పొందవచ్చునని బ్యాంకు అంచనా వేస్తోంది. కాగా, సరళతరమైన ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ కోసం ఓ డమ్మీ ప్లాస్టిక్ కార్డును కస్టమర్లకు బ్యాంకు అందిస్తుంది.

English summary

బ్యాంక్ ఆఫ్ బరోడా వేరబుల్ ప్రోడక్ట్స్, రూ.5000 వరకు చెల్లింపులు | Bank of Baroda launches wearable products for small ticket payments up to Rs 5,000

State owned Bank of Baroda on Monday announced the launch of the wearable line of products for small-ticket payments up to Rs 5,000 through the BoB World Wave in association with the National Payments Corporation of India (NPCI).
Story first published: Tuesday, December 14, 2021, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X