Bank Of Baroda: రుణ గ్రహీతలకు షాకిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. వడ్డీ రేటు పెంపు..!
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ తీసుకున్నవారికి షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫండ్స్ ఆధారిత మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటును పెంచింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా చేసింది. ముఖ్యంగా 3 నెలల కాల పరిమితి గల ఎంసీఎల్ఆర్ (MCLR) రేటును బ్యాంక్ ఆఫ్ బరోడా మార్చింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రేటు 8.30 శాతానికి పెరిగింది.పెంచిన ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 12, 2026 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం కేవలం 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటును మాత్రమే పెంచినట్లు వివరించింది.
8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. మిగిలిన కీ ఎంసీఎల్ఆర్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కాగా ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతం వద్ద ఎలాంటి మార్పు చేయలేదని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ బెంచ్ మార్క్‌తో ముడిపడి ఉండే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆయా రుణ గ్రహీతల రీసెట్ తేదీ రాగానే వారి నెలవారీ ఈఎంఐ పెరిగే అవకాశం ఉంది లేదా రుణ కాల పరిమితి స్వల్పంగా పెరగొచ్చు.

మీ రుణం ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటుతో లింక్ అయి ఉందోలేక బ్యాంక్ స్టేట్ మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ విలువ 2.1% తగ్గి రూ. 244.6 వద్ద ట్రేడవుతున్నాయి. BSE BANK సూచీ 0.36% తగ్గి 65068.88 వద్ద నమోదైంది. గత నెల రోజుల్లో ఈ సూచీ 0.94% క్షీణించింది. ఈ సూచీలోని ఇతర బ్యాంకుల విషయానికొస్తే, ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.76%, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 0.67% మేర తగ్గుదలను నమోదు చేశాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications