BOB: లోన్లు తీసుకున్న వారికి షాక్.. భారీగా వడ్డీ రేట్లు పెంచిన ఆ బ్యాంకు..!
ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో పలు ఎన్భీఎఫ్సీలు, బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. కానీ.. ఇంతవరకు లోన్లపై వడ్డీ రేట్లను పెంచలేదు. ఇప్పుడు రుణాల వడ్డీ రేట్లపై బ్యాంకులు దృష్టి సారించాయి. తాజాగా ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా రుణగ్రహీతలకు షాక్ ఇచ్చింది. లోన్ వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. వివిధ రుణ కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను(MCLR) ఏకంగా 20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు బ్యాంక్ ఆధికారికంగా ప్రకటించింది. తాజా లోన్ రేట్ల పెంపుతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు EMIల ఆర్థిక భారం మరింత పెరగనున్నాయి.
ఈ కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 12, 2026 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది. ఒక నెల కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 8.00 శాతానికి పెంచింది. అలాగే 3 నెలల రేటు 8.30 శాతం నుంచి 8.50 శాతానికి చేర్చింది. 6 నెలల కాలపరిమితి కలిగిన రుణాలు 8.50 శాతం నుంచి 8.70 శాతానికి పెంచింది. ఇక రిటైల్ లోన్లకు అత్యంత కీలకమైన ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 8.75 శాతం నుంచి 8.85 శాతంగా మార్చింది. అయితే ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా 7.85 శాతాన్నే కొనసాగించింది. ఈ వడ్డీ రేట్ల పెంపు నేరుగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ప్రభావం చూపనుంది.

ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్లు తీసుకున్న కస్టమర్లకు.. వారి రీసెట్ తేదీలు వచ్చినప్పుడు వడ్డీ భారంతో పాటు నెలవారీ EMIలు పెరిగే అవకాశం ఉంటుంది.. లేదంటే లోన్ చెల్లించే కాలాన్ని బ్యాంకులు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఆర్‌బీఐ రెపో రేటు వంటి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌లకు అనుసంధానించబడిన లోన్ తీసుకున్న వినియోగదారులపై మాత్రం ఈ ఎంసీఎల్ఆర్ పెంపు ప్రభావం ఉండదని బ్యాంక్ స్పష్టం చేసింది. తాజాగా వడ్డీ రేట్లను పెంచడానికి అసలు కారణాలను మాత్రం బ్యాంక్ పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వెంటనే తమ లోన్ అగ్రిమెంట్లను, రీసెట్ తేదీలను పరిశీలించుకోవాల్సి అవసరం ఉంది.
మిగతా బ్యాంకులు కూడా లోన్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐ మరోసారి రెపో రేటు పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యాంకులు వేచి చూస్తున్నాయి. మరోసారి ఆర్బీఐ రెపో రేటు పెంచితే బ్యాంకులు రుణాలపై వడ్డీలు పెంచే అవకాశం ఉంది. మరో పక్క కొన్ని బ్యాంకులు ఇప్పటి వరకు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచలేదు. ఆర్బీఐ నిర్ణయం తర్వాత ఆ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications