జూన్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా ఇదిగో.. మీ ఆర్థిక ప్రణాళికలను ఇలా సిద్ధం చేసుకోండి!

Bank Holidays in June 2026: కొత్త నెల ప్రారంభం కాబోతుందంటే చాలు, సామాన్యుల నుండి వ్యాపారస్తుల వరకు ప్రతి ఒక్కరూ తమ దైనందిన పనుల షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా బ్యాంకులతో ముడిపడి ఉన్న పనులు, ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగాలంటే ఆ నెలలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.

ఏ రోజుల్లో మూసివుంటాయనే సమాచారం ముందుగానే తెలిసి ఉండటం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, జూన్ 2026 నెలలో వివిధ పండుగలు, జాతీయ దినోత్సవాలు, సాధారణ వారాంతపు సెలవులతో కలిపి బ్యాంకులు నిర్దిష్ట రోజుల్లో మూసివేయబడనున్నాయి.

జూన్ నెలలో సాధారణంగా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పండుగలు లేనప్పటికీ, ప్రాంతీయ సంస్కృతులు, స్థానిక పండుగలను బట్టి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సెలవులు ఉన్నాయి. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండవ శనివారం, నాల్గవ శనివారం, అన్ని ఆదివారాలు బ్యాంకులు తప్పనిసరిగా మూసివుంటాయి.

Bank holidays June 2026 June 2026 bank holiday list RBI bank holidays bank closure dates India June banking holidays public holidays June 2026 RBI holiday calendar Indian bank holidays bank holidays state wise June 2026 holiday calendar banks closed dates online banking services second Saturday holiday Sunday bank holidays festival bank holidays banking updates India RBI latest news June holidays India bank working days financial news India 2026 2026 2026

జూన్ 2026 నెలకు సంబంధించిన కీలకమైన బ్యాంక్ సెలవుల వివరాలను పరిశీలిస్తే:

జూన్ 7 : ఆదివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ రోజు మూసివేయబడతాయి.

జూన్ 13 (రెండవ శనివారం): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ రోజు మూసివేయబడతాయి.

జూన్ 14 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు దినం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఒడిశా రాష్ట్రంలో ఈ రోజున 'పహిలి రాజా' పండుగను కూడా జరుపుకుంటారు.
జూన్ 15 (సోమవారం): మిజోరంలో 'వైఎంఏ డే' (YMA Day) మరియు ఒడిశా రాష్ట్రంలో 'రాజా సంక్రాంతి' పండుగ సందర్భంగా స్థానికంగా బ్యాంకులు మూసివుంటాయి. మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
జూన్ 17 (బుధవారం): 'మహారాణా ప్రతాప్ జయంతి' పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూన్ 18 (గురువారం): పంజాబ్ రాష్ట్రంలో 'శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం' (Martyrdom Day) కారణంగా బ్యాంకులు పనిచేయవు.
జూన్ 26 (శుక్రవారం):ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన 'మొహర్రం' (అశూరా) పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివుంటాయి.
జూన్ 27 (నాల్గవ శనివారం):దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ 28 (ఆదివారం): సాధారణ వారాంతపు శెలవు దినం.
జూన్ 29 (సోమవారం): ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో 'సంత్ గురు కబీర్ జయంతి' (ప్రకట్ దివస్) సందర్భంగా బ్యాంకులు మూసివుంటాయి.
జూన్ 30 (మంగళవారం): మిజోరం రాష్ట్రంలో 'రెమ్నా నీ' (Remna Ni) దినోత్సవం కారణంగా స్థానికంగా బ్యాంకులకు శెలవు ఉంటుంది.

Also Read

పైన పేర్కొన్న పండుగ సెలవులు చాలా వరకు ప్రాంతీయ ప్రాతిపదికన (రాష్ట్రాలను బట్టి) మారుతుంటాయి. కాబట్టి వినియోగదారులు తమ స్థానిక బ్యాంక్ బ్రాంచ్ స్థితిని ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. బ్యాంక్ భౌతిక బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. పౌరులు తమ అత్యవసర నగదు విత్‌డ్రాయల్స్ కోసం ఏటీఎం (ATM)లను ఉపయోగించుకోవచ్చు. అలాగే డబ్బులు బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), నెఫ్ట్ (NEFT) మరియు ఆర్‌టీజీఎస్ (RTGS) వంటి ఆన్‌లైన్ సేవలు సెలవు రోజుల్లో కూడా అంతరాయం లేకుండా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+