ప్రస్తుతం చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని బ్యాంకులు ఆ రేట్లను ఇంకా తగ్గించాయి. దీనివల్ల బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవాళ్లు తక్కువ వడ్డీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే డబ్బుదాచుకోవడానికి దీని కంటే బెటర్ ఆప్షన్స్ బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ స్కీముల్లో బ్యాంకుల కంటే కాస్త ఎక్కువ వడ్డీ అందుతుంది. వీటిలో పొదుపు చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో మంచి ఆదాయాన్ని పొందే వీలుంటుంది.

ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6 నుంచి7 శాతం వరకే ఉంటే.. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో మాత్రం వడ్డీ రేట్లు 7 శాతానికి పైగా ఉన్నాయి. పైగా వీటి ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అలాగే బ్యాంకులు వడ్డీరేట్లు అప్పుడప్పుడు మార్చే అవకాశం ఉంది. కానీ, పోస్టాఫీసుల్లో ఫిక్స్ డ్ వడ్డీ రేట్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకులతో పోలిస్తే.. పోస్టాఫీస్ స్కీములతో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయనే చెప్పాలి. ప్రస్తుతం మంచి వడ్డీ రేటుతో అందుబాటులో ఉన్న కొన్ని పోస్టాఫీస్ స్కీముల ఇవే..
- టైమ్ డిపాజిట్ స్కీమ్: ఈ స్కీమ్ లో వడ్డీ 7 శాతంగా ఉంది. మూడు నెలలకు ఒకసారి కాంపౌండ్ వడ్డీ జమ అవుతుంది. ఈ స్కీమ్ లో రూ.1 లక్ష జమ చేస్తే ఏడాదికి రూ.7 వేల వరకు వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో టెన్యూవర్ 3 ఎళ్లకు పెంచుకుంటే వడ్డీ రేటు 7.10 శాతానికి పెరుగుతుంది. అదే 5 ఏళ్లకు అయితే వడ్డీ రేటు 7.5 శాతం ఉంటుంది.
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: ఈ స్కీమ్ ద్వారా 8.20 శాతం వడ్డీ పొందొచ్చు. ఇందులో రూ.1 లక్ష జమ చేస్తే మూడు నెలలకోసారి రూ.2000 వడ్డీ వస్తుంది. ఏడాదికి లెక్కెస్తే.. రూ.8 వేల వరకూ వడ్డీ పొందొచ్చు.
- మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్: ఈ స్కీమ్ ద్వారా 7.40 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. ఇందులో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.7,440 వరకు వడ్డీ ఆదాయం పొందొచ్చు.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్: ఈ స్కీమ్ ద్వారా 7.10 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్ ను 15 ఏళ్ల పాటు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఏడాదికోసారి వడ్డీ ఇస్తారు.
- కిసాన్ వికాస్ పత్ర స్కీమ్: ఈ స్కీమ్ లో వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఈ స్కీమ్ కు 115 నెలల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ముగిసిన తర్వాత వడ్డీ చేతికొస్తుంది.
- సుకన్య సమృద్ధి యోజన: ఈ స్కీమ్ ద్వారా అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. ఇందులో ఏడాదికోసారి వడ్డీ ఇస్తారు. ఎక్కువ టెన్యూవర్ పెట్టుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది.


Click it and Unblock the Notifications