కొత్తగా హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.. BHFL గుడ్‌న్యూస్, వారికి కూడా ఈ ప్రయోజనం
హోమ్ లోన్ తీసుకునే వారికి బజాజ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో ఇటీవలి వరకు డిమాండ్ మందగించింది. ఇప్పుడు పండుగ నేపథ్యంలో డిమాండ్ పుంజుకునే చర్యలను వివిధ బ్యాంకులు ప్రకటించాయి. తాజాగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(BHFL) కొత్త వినియోగదారులకు ఈ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకునే వారు ఏడాదికి 6.9 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకోవచ్చునని తెలిపింది.

వడ్డీ రేటు తగ్గింపు.. ఈఎంఐ భారం తగ్గుదల
తమ ఈ ప్రకటన పండుగ సీజన్‌లో హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త అని, భారీ ఖర్చులు తీర్చడానికి ఈ సమయంలో వడ్డీ రేటు తగ్గింపు చాలామందికి దోహదపడుతుందన కంపెనీ తెలిపింది. తక్కువ వడ్డీ రేటు, తక్కువ మొత్తం ఈఎంఐ ద్వారా రుణగ్రహీతలకు ప్రయోజనం, తక్కువ వడ్డీ రేటు ఔట్-గో, చవకైన టాపప్-రుణాల వంటి ప్రయోజం పొందుతారని తెలిపింది. తక్కువ వడ్డీకే హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా రుణగ్రహీతలపై భారం తగ్గుతుందని, నికర వడ్డీ చెల్లింపు కూడా తగ్గుతుందని తెలిపింది.

తక్కువ వడ్డీ కావాలంటే..
కొత్త రుణగ్రహీతలకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నట్లు బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో రుణాలు తీసుకున్నవారు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనం పొందడానికి తమ మిగతా హోమ్ లోన్ టర్మ్‌ను బజాజ్ ఫైనాన్స్‌కు బదలీ చేసుకోవచ్చునని కూడా కంపెనీ వెల్లడించింది. కాలపరిమితి ప్రారంభంలో ఈ ప్రయోజనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.

ఫ్లోటింగ్ రేటు లోన్స్ వారికి ప్రయోజనం
కొత్త కస్టమర్లు, ఫ్లోటింగ్ రేట్ లోన్స్ పైన ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఈ వడ్డీ రేటు తగ్గింపుతో ప్రయోజనం పొందుతారని BHFL తెలిపింది.గృహకోనుగోలుదారులు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్ సైట్ ద్వారా రూ.3.5 కోట్ల వరకు రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
గత ఏడాది ఆర్థిక మందగమనం, ఈసారి కరోనా వల్ల వడ్డీ రేట్లు భారీగా తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో రెపో రేటు తగ్గడంతో దేశవ్యాప్తంగా వడ్డీ తగ్గుతోందని, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో హోమ్ లోన్ బయ్యర్స్ మరింత ప్రయోజనం పొందుతారని తెలిపింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం పుణేలో ఉంది.


Click it and Unblock the Notifications