పండుగను దృష్టిలో పెట్టుకొని పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు హోమ్ లోన్ నుండి పర్సనల్ లోన్ వరకు వడ్డీ రేట్లను తగ్గించాయి.. తగ్గిస్తున్నాయి. ఇతర రుణాల వడ్డీ రేట్లతో పోలిస్తే హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు ఎప్పుడు తక్కువగా ఉంటాయి. గతంతో పోలిస్తే వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టానికి తగ్గాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో రియాల్టీ మాత్రమే కాదు.. అన్నింటా డిమాండ్ పడిపోయింది. ఓ వైపు ఆర్థిక రికవరీ కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరోవైపు పండుగ సీజన్ నేపథ్యంలో సేల్స్ పెంచుకోవడానికి, తద్వారా డిమాండ్ పెరగడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు వివిధ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తాయి. తాజాగా బజాజ్ ఫైనాన్స్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది.

ఈఎంఐ రూ.645 మాత్రమే
ఈ మేరకు బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ ఇటీవల ఓ ప్రకటన చేసింది. హోమ్ లోన్ పైన వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు వడ్డీ రేటు 6.70 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. అంటే వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంది. రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారి క్రెడిట్ స్కోర్ బాగుంటే, ఆదాయానికి సంబంధించిన ప్రొఫైల్ కూడా బాగుంటే ఈ ప్రమోషనల్ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ రేటుతో వారి ఈఎంఐ నెలకు ప్రతి లక్ష రూపాయలకు రూ.645 మాత్రమే అవుతుంది.

టాప్-అప్ లోన్ సౌకర్యం
నిబంధనల మేరకు రూ.5 కోట్ల వరకు కూడా రుణాన్ని పొందొచ్చును. ఈ వడ్డీ రేటు ప్రకారం ప్రతి రూ.1లక్షకు ఈఎంఐ రూ.645గా ఉంది. హోమ్ లోన్ తీర్చే కాలవ్యవధి అత్యధికంగా 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయ ప్రొఫైల్ కలిగిన దరఖాస్తుదారులకు 6.70 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు బజాజ్ ఫిన్ సర్వ్‌కు బదలీ చేసుకోవచ్చు. తద్వారా కూడా ఈ కొత్త వడ్డీ రేటు ప్రయోజనం పొందవచ్చునని బజాజ్ ఫిన్ సర్వ్ తెలిపింది. వడ్డీ రేటు తక్కువగా ఉండటంతో పాటు టాప్-అప్ లోన్ సౌకర్యం కూడా ఉంది.

హోమ్ లోన్ బదలీ ప్రక్రియ
ఈ హోమ్ లోన్ బదిలీ ప్రక్రియ త్వరగా, ఇబ్బందిలేకుండా, తక్కువ డాక్యుమెంటేషన్‌తో పూర్తవుతుంది. ఆసక్తి, అర్హులైన కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా బ్రాంచీ ద్వారా ఆఫ్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం ధరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్ ధరఖాస్తుదారు కాంటాక్ట్-ఫ్రీ-లోన్ అప్లికేషన్ నుండి ప్రయోజనం పొందుతారు. ఈ దరఖాస్తులో చివరి దశ మినహా మొత్తం ప్రాసెసింగ్ ఫోన్ కాల్ లేదా ఈ-మెయిల్ ద్వారా జరుగుతుంది. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ఈడబ్ల్యుఎస్ ఎల్ఐజీ హోమ్ రుణదారులకు వడ్డీలో రాయితీ ఉంటుంది. రుణాన్ని తీసుకునేటప్పుడు, డాక్యుమెంట్స్ ప్రక్రియలో సంస్త సిబ్బంది సేవలు ఇంటి వద్ద లభిస్తాయి. రుణగ్రహీత ఉద్యోగం చేసేవారయితే పబ్లిక్, ప్రయివేటు, బహుళజాతి కంపెనీల్లో కనీసం మూడేళ్లు ఉద్యోగ అనుభవం ఉండాలి. హోమ్ లోన్ పొందడానికి కనీసం 23 ఏళ్లు ఉండి, భారతీయుడై ఉండాలి. రుణం గడువు తీరిపోయే నాటికి గరిష్ట వయస్సు 62గా ఉండాలి. కనీస ఆదాయం రూ.30వేల నుండి రూ.50 వేలు ఉండవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications