Bajaj Finance: వడ్డీ రేట్లకు రెక్కలు రావటంతో చిన్న పొదుపరులకు మంచి రాబడులు వస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువ రిటర్న్స్ అందించేందుకు బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీలు సైతం పోటాపోటీగా డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. తాజాగా బజాజ్ ఫైనాన్స్ తక్కువ కాలానికి ఎక్కువ వడ్డీని అందించేందుకు సిద్ధమైంది.

39 నెలల కాలానికి..
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC). సీనియర్ సిటిజన్‌లకు 7.85% వడ్డీ రేటుతో మంగళవారం నుంచి అమలులోకి వచ్చే కొత్త 39-నెలల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీనికింద సీనియర్ సిటిజన్లు కానివారికి సైతం కంపెనీ ఆకర్షనీయమైన 7.60% వడ్డీ రేటును అందిస్తోంది.

7.95% వడ్డీ రేటు..
ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.95% వడ్డీని 44 నెలల కాల వ్యవధికి అందిస్తోంది. ఇదే కాలానికి నాన్-సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.70% వడ్డీని చెల్లించనున్నట్లు ప్రకటించింది. అయితే 15-నెలల ప్రత్యేక FDకి 6.95% (సీనియర్ కాని పౌరులకు వడ్డీ లభిస్తుంది.

క్యుములేటివ్ ఎఫ్‌డీ..
సీనియర్ సిటిజన్ల కోసం 12-23 నెలల క్యుములేటివ్ ఎఫ్‌డీని 7.05% రేటుకు బజాజ్ అందుబాటులో ఉంచింది. అయితే 15 నెలల ప్రత్యేక ఎఫ్‌డీకి సీనియర్ సిటిజన్‌లకు 7.20% చెల్లిస్తోంది. 12-60 నెలల వరకు పదవీకాల FDలను ప్రారంభించడానికి కంపెనీ పొదుపరులను అనుమతిస్తోంది. కంపెనీ సాధారణంగా 6 నెలలకు ఒకసారి రేట్లను మార్చుతుందని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఫిక్సెడ్ డిపాజిట్లు & ఇన్వెస్ట్‌మెంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ సిక్కా వెల్లడించారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications