Bajaj Finance: గుడ్ న్యూస్ చెప్పిన బజాజ్ ఫైనాన్స్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు..!

దేశంలోని అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFC) ఒకటైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 12 నుంచి 60 నెలల కాలపరిమితి గల తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలపై) వడ్డీ రేట్లను 15 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సవరించిన FD రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లు, పునరుద్ధరణలు రెండింటికీ వర్తిస్తాయని పేర్కొంది. ఈ NBFC దీర్ఘకాలిక డిపాజిట్లపై అత్యధిక రేటు పెంచింది. ఇందులో భాగంగా 31 నుంచి 60 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 35 బేసిస్ పాయింట్లు, సీనియర్ సిటిజన్లకు 40 బేసిస్ పాయింట్లు రేట్లు పెంచినట్లు వెల్లడించింది.

సవరించిన రేట్ల ప్రకారం సాధారణ డిపాజిటర్లు ఏడాదికి 7.75% వరకు, అలాగే సీనియర్ సిటిజన్లు ఏడాదికి 8.15% వరకు వడ్డీని పొందవచ్చు. డిపాజిట్లను పునరుద్ధరించుకునే వారికి అదనంగా ఏడాదికి 0.10% ప్రయోజనం లభిస్తుంది.సమతుల్య పొదుపు పోర్ట్‌ఫోలియోలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతుందని బజాజ్ ఫైనాన్స్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ సిక్కా అన్నారు. ప్రత్యేకించి ఊహించదగిన రాబడులను ఆశించే సీనియర్ సిటిజన్లకు ఇవి చాలా అవసరమన్నారు. తాము తమ రేటు పెంపును దీర్ఘకాలిక కాలపరిమితి గల డిపాజిట్లకే ఎక్కువగా పరిమితం చేశామన్నారు. తద్వారా డిపాజిటర్లు నిమిషాల్లో ఆన్‌లైన్‌లో తెరవగల AAA-రేటెడ్ డిపాజిట్‌పై ఐదేళ్ల వరకు అధిక రాబడులను పొందవచ్చన పేర్కొన్నారు.

Bajaj Finance

క్రమం తప్పకుండా డిపాజిట్ చేసేవారు ఇప్పుడు 31 నుంచి 60 నెలల కాలపరిమితి గల క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 7.75% వరకు వడ్డీని పొందవచ్చు. ఇది గతంలో ఉన్న సంవత్సరానికి 7.40% రేటు కంటే ఎక్కువ. తక్కువ కాలపరిమితి గల డిపాజిట్ల విషయానికొస్తే 12 నుంచి 17 నెలల కాలపరిమితికి వడ్డీ రేటును సంవత్సరానికి 6.60% నుంచి 6.80%కి పెంచారు. 18 నుంచి 30 నెలల కాలపరిమితి గల డిపాజిట్లకు వడ్డీ రేటు సంవత్సరానికి 6.85% నుంచి 7.00%కి పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ సీనియర్ సిటిజన్లకు అందించే అదనపు వడ్డీ రేటును కూడా పెంచింది.

సీనియర్ సిటిజన్లు ఇప్పుడు అన్ని కాలపరిమితులలో వర్తించే సాధారణ డిపాజిటర్ రేటుపై సంవత్సరానికి అదనంగా 0.40 శాతం పొందనున్నారు. సవరించిన రేట్ల ప్రకారం 31 నుంచి 60 నెలల కాలపరిమితి గల కొత్త క్యుములేటివ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి 8.15 శాతం వరకు సంపాదించవచ్చు. ఇది గత వార్షిక రేటు అయిన 7.75%తో పోల్చితే ఎక్కువ.
12 నుంచి 17 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు ఇప్పుడు సంవత్సరానికి 7.20% సంపాదిస్తారుయ కాగా 18 నుంచి 30 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. బజాజ్ ఫైనాన్స్‌లో మెచ్యూర్ అయిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పునరుద్ధరించుకునే డిపాజిటర్లు, వర్తించే రేటుపై అదనంగా సంవత్సరానికి 0.10 శాతం పొందనున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+