Axis Bank: ఖాతాదారులకు షాకిచ్చిన యాక్సిస్ బ్యాంక్.. ఛార్జీలు పెంపు..!

యాక్సిస్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాంక్ పొదుపు, జీతం ఖాతాలపై ఫీజులు, ఛార్జీలలో సవరణ చేసింది. సవరించిన ఛార్జీలు, ఫీజులు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
కనీస నిల్వ నిర్వహించకపోవడం, నగదు లావాదేవీలు, చెక్కు రిటర్న్‌లు, రిలేషన్‌షిప్ విలువ అవసరాలు, రివార్డ్ పాయింట్లలో మార్పులు చేసింది. సవరించిన ఫీజు విధానం ప్రకారం సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలోని కస్టమర్ల కోసం దేశీయ పొదుపు ఖాతాలలో సగటు నెలవారీ నిల్వ (AMB) నిర్వహించనందుకు విధించే గరిష్ట నెలవారీ సేవా ఛార్జీ పెరుగనుంది. అవసరమైన AMBలో లోటుపై 6% చొప్పున ఈ ఛార్జీని లెక్కించనున్నారు.

మెట్రో, పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట ఛార్జీ ఇప్పుడు రూ.600కు పరిమితం చేశారు. ప్రస్తుతం మెట్రో, పట్టణ ప్రాంతాలకు గరిష్ట ఛార్జీ రూ.600, సెమీ-అర్బన్ ప్రాంతాలకు రూ.300, గ్రామీణ ప్రాంతాలకు రూ.150గా ఉంది. ప్రవాస భారతీయుల (NRI) ఈజీ యాక్సెస్, దానికి సమానమైన ఖాతాల కోసం ప్రస్తుతం మెట్రో, పట్టణ శాఖలకు రూ.600, సెమీ-అర్బన్, గ్రామీణ శాఖలకు రూ.300గా ఉన్న పరిమితికి బదులుగా అన్ని ప్రాంతాలలో గరిష్ట ఛార్జీ రూ.600గా ఉంటుంది. అవసరమైన బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఎలాంటి కనీస ఛార్జీ ఉండదు. ఈ నిబంధన దేశీయ, ఎన్నారై ఈజీ యాక్సెస్, దానికి సమానమైన ఖాతాలకు వర్తిస్తుంది. జీతం పొందే కస్టమర్లకు వర్తించదు.

Axis Bank

యాక్సిస్ బ్యాంక్, ప్రైమ్, ప్రెస్టీజ్, ప్రయారిటీ, సంపన్, అడ్వాంటేజ్, అరైజ్ ఉమెన్స్, బర్గుండి వంటి కేటగిరీల కింద ఉన్న దేశీయ, ఎన్నారై ఖాతాల కోసం టోటల్ రిలేషన్‌షిప్ వాల్యూ (TRV) కూడా సవరించింది. ప్రస్తుత విధానం ప్రకారం 75 శాతంతో పోలిస్తే, కస్టమర్లు ఇప్పుడు నిర్దేశించిన టీఆర్వీలో 100% నిర్వహించాల్సి ఉంటుంది. సవరించిన విధానం ప్రకారం వినియోగదారులు మూడు ఉచిత నగదు లావాదేవీలు లేదా రూ.1 లక్ష వరకు లావాదేవీలు, ఈ రెండింటిలో ఏది ముగిస్తే అది చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిమితి నాలుగు లావాదేవీలు లేదా రూ.1 లక్ష ఈ రెండింటిలో ఏది ముగిస్తే అది.

ప్రస్తుతం కస్టమర్ల నుంచి మొదటి చెక్ రిటర్న్‌కు రూ.50, రెండవ రిటర్న్ నుండి రూ.100 వసూలు చేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రతి రిటర్న్‌కు ఛార్జీ స్థిరంగా రూ.200గా ఉంటుంది. ఎన్నారై బర్గుండి, ప్రయారిటీ, ప్రెస్టీజ్, ప్రైమ్ ఖాతాదారులకు డెలివరబుల్ రిటర్న్ ఛార్జీలు ప్రతి రిటర్న్‌కు రూ.50 నుంచి రూ.500కు పెరగనున్నాయి. సవరించిన విధానం ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ బర్గుండి, ప్రయారిటీ, ప్రెస్టీజ్, ప్రైమ్ ఎన్నారై ఖాతాలతో పాటు ఈజీ ఎన్నారై ఖాతాలకు కూడా ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను నిలిపివేస్తుంది. ఈ కస్టమర్లు ప్రస్తుతం ఉన్న ఎడ్జ్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద పాయింట్లను సంపాదించడానికి అర్హులు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+