ఈ కాలంలో ఉద్యోగం చేసే చాలామంది తమ అవసరాల నిమిత్తం లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ లేదా వెహికిల్ లోన్ ఇప్పుడు సాధారణం. అవసరమైనప్పడుు లోన్ తీసుకోవడం తప్పుకాదు. కానీ ఇలాంటి సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి. అనాలోచితంగా తీసుకునే లోన్ ఆ తర్వాత మనకు భారమై కూర్చుంటుంది.

పర్సనల్ లోన్ పైన వడ్డీ రేటు ఎక్కువ
ఉదాహరణకు వడ్డీరేటు ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఈఎంఐ-కాలపరిమితి మనకు ఎక్కడ అనుకూలంగా ఉంది, ప్రాసెసింగ్ ఫీజు ఎక్కడ తక్కువగా ఉంది వంటి అంశాలను పరిశీలించి లోన్ తీసుకోవడం మంచిది. పర్సనల్ లోన్ విషయంలో చాలామంది మరీ నిర్లక్ష్యంగా ఉంటారు. హోమ్ లోన్, వెహికిల్ లోన్ వంటి సురక్షిత లోన్ల కంటే పర్సనల్ లోన్ పైన వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎన్నో అంశాలు చూసుకోవాలి.

అవసరం లేకుండా వద్దు
కొంతమంది తమ అవసరానికి మించి లోన్ తీసుకుంటారు. ఉదాహరణకు రూ.3 లక్షలు అవసరమైతే మనకు రూ.4 లక్షలు వస్తుంది కదా, మిగతాది మనకు అలా ఉండిపోతుంది.. తీసేసుకుందాం అని భావిస్తారు. ఎంతమేరకు అవసరమో అంతే తీసుకోవడం మంచిది. అవసరానికి మించి తీసుకుంటే ఆ తర్వాత ఆ మొత్తం మీ చేతుల్లో ఉండటం తక్కువ. అవసరపు ఖర్చు పెట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకొంతమంది ఆఫర్లు వంటివి చూసి అవసరం లేకున్నా తీసుకుంటారు. అది కూడా సరికాదు. అనవసరంగా లోన్ తీసుకొని, దానిని సరిగ్గా చెల్లించకుండే మీ క్రెడిట్ స్కోర్ పైన దెబ్బపడుతుంది. అంటే అవసరం లేకుండా లేదా అవసరానికి మించి తీసుకోవద్దు.

క్రెడిట్ స్కోర్
మీరు రుణం తీసుకునే ముందు ఓసారి క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది. 750 ప్లస్ స్కోర్ ఉంటే మీ దరఖాస్తు సులభంగా ఆమోదం పొందుతుంది. అలాగే ప్రాధాన్యతా వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటివి ఉంటాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. రుణం తీసుకోవడానికి ముందు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకొని, క్రిడెట్ కార్డు, ఈఎంఐ సహా అన్ని చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ కొంత మెరుగుపరుచుకోవచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి ఏమైనా లోపాలు ఉంటే బ్యాంకును సంప్రదించాలి.

చెల్లింపు సామర్థ్యం
చాలామంది ప్రస్తుతం తమ అవసరానికి లోన్ తీసుకుంటారు. కానీ ఆ తర్వాత ప్రతి నెల ఎంత చెల్లించగలమనే అంశాన్ని ఆలోచించరు. తీరా లోన్ తీసుకొని, ఒకటి రెండు నెలలు అయ్యాక ఇబ్బందులు ఏర్పడితే అప్పుడు రియలైజ్ అవుతారు. కాబట్టి మన చెల్లింపు సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఏ మేరకు పోతాయి, మిగిలేది ఎంత, మనం కట్టగలుగుతామా అని చూసుకోవడం మంచిది.

మరికొన్ని పొరపాట్లు..
- లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు టర్మ్స్ అండ్ కంటిషన్స్ పూర్తిగా చదువుకోవాలి.
- ఇతర బ్యాంకులలో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు వంటిని సరిపోల్చుకోవాలి.
- తక్కువ కాలంలో పలుమార్లు రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications