Stock Market Investment: డే-ట్రేడింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే
స్టాక్ మార్కెట్ పెట్టుబడి అంటే దీర్ఘకాలానికి మాత్రమే కాదు. డే-ట్రేడింగ్ చేసేవారు చాలామంది ఉంటారు. కచ్చితమైన రాబడి కోసం మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే డే ట్రేడింగ్ చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. మన లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలం, స్వల్పకాలం, మధ్యకాలానికి ఇన్వెస్ట్ చేయాలి. అయితే కోట్లాదిమంది డే-ట్రేడింగ్ చేస్తారు. వీరి లాభనష్టాలు ఆ రోజుకు పరిమితం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సద్దుమణిగినట్లుగా కనిపించడంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. మార్కెట్ అప్ సైడ్ కనిపిస్తోందని, నిఫ్టీ ఈ వారం చివరి నాటికి 17,800 నుండి 18,000 స్థాయికి చేరుకోవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తక్షణ మద్దతు మాత్రం 17,550 వద్ద కనిపిస్తోందని చెబుతున్నారు.

నిఫ్టీ ఇలా కదలాడవచ్చు
నిఫ్టీ శుక్రవారం 17,550 స్థాయి వద్ద బ్రేక్-ఔట్‌ను అందించిందని, ఇది 50 స్టాక్ ఇండెక్స్‌కు తక్షణ మద్దతుగా పని చేస్తోందని, అయితే దీని తక్షణ నిరోధకం 17800 వద్ద కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డే-ట్రేడర్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీని 17400 నుండి 18000 మధ్య కదలాడుతుందని పరిగణించవచ్చునని అంటున్నారు.

ఈ స్టాక్స్ అదుర్స్
ఈ మేరకు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు ఈ వారానికి కొన్ని స్టాక్స్‌ను రికమెండ్ చేస్తున్నారు. అందులో అంబుజా సిమెంట్స్ స్టాక్ రూ.315 నుండి రూ.320గా అంచనా వేస్తున్నారు. బజాజ్ ఆటో షేర్ ధర ప్రస్తుతం రూ.3750 వద్ద ఉండగా, ఈ వారానిగి ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.3900గా అంచనా వేస్తున్నారు.

ఈ స్టాక్స్ కూడా..
ఇతర స్టాక్స్ విషయానికి వస్తే బిర్లా సాఫ్ట్ రూ.455 స్టాప్ లాస్, రూ.490 టార్గెట్ ధర, కొటక్ మహీంద్రా స్టాప్ లాస్ రూ.1700, టార్గెట్ ధర రూ.1932, అదానీ పవర్ స్టాప్ లాస్ రూ.189, టార్గెట్ ధర రూ.235, HDFC లిమిటెడ్ స్టాప్ లాస్ రూ.2400, టార్గెట్ ధర రూ.2580, గెయిల్ స్టాప్ లాస్ రూ.157, టార్గెట్ ధర రూ.173గా అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications