ఆన్‌లైన్‌లో అటల్ పెన్షన్ యోజన పథకానికి దరఖాస్తు చేయండి
రూ.1000 నుండి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్ పొందే అటల్ పెన్షన్ యోజన(APY) ఖాతాను బ్రాంచీలను సంప్రదించకుండానే ఆధార్ కేవైసీతో ఆన్ లైన్ ద్వారా తెరువవచ్చు. ఖాతా తెరవాలనుకునే వారు తమ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించి అటల్ పెన్షన్ యోజన ఖాతాను బ్యాంకు ఖాతా సహకారంతో ఆన్‌లైన్‌లో సులభంగా తెరువవచ్చు. APY ఫామ్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఆధార్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ APY ఖాతాను తెరిచే సమయంలో మీరు మీ బ్యాంకు ఖాతా నెంబర్‌ను, ఆధార్‌తో నమోదు చేయబడిన ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి.

ఏపీవై ఖాతా ఆన్‌లైన్
నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) నిర్వహించే ప్రభుత్వ సంస్థ అయిన పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కూడా అటల్ పెన్షన్ యోజనకు రెగ్యులేటర్. బ్యాంకు శాఖను సందర్శించకుండానే ఇబ్బందులు లేని డిజిటల్ నమోదును అనుమతిస్తుంది. బ్రాంచీకి వెళ్లకుండా APY ఖాతాను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయడానికి eAPY లింకును అన్ని APY సేవా బ్యాంకుల వెబ్ సైట్‌లో యాక్సెస్ చేయవచ్చు. అటల్ పెన్షన్ యోజన కోసం లింక్ సృష్టించబడిన NSDL NPS వెబ్ సైట్‌ను కూడా సందర్శించవచ్చు.

హామీ పథకం
APY 9వ తేదీ మే 2015లో ప్రారంభించారు. పేదలు, నిరుపేదలు, అసంఘటిత రంగంలోని కార్మికులు సహా భారతీయులందరి సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించడానికి అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించారు. APY రూ.1000 నుండి రూ.5000 వరకు హామీ ఇవ్వబడిన పెన్షన్ పథకం. ఎలాంటి చట్టబద్దమైన సామాజికా భద్రతా పథకాల పరిధిలోకి రాని, ఆదాయపు పన్ను చెల్లింపుదారు కానీ వారికి ప్రభుత్వంచే కాంట్రిబ్యూషన్‌లో సహకారం అందిస్తుంది.

వీరు అర్హులు
జూన్ 1, 2015 నుండి మార్చి 31, 2016 మధ్య కాలంలో స్కీంలో చేరిన అర్హులైన ప్రతి చందాదారుకు అయిదేళ్ల పాటు భారత ప్రభుత్వం సహకారం అందిస్తుంది. అటల్ పెన్షన్ యోజనకు బ్యాంకు ఖాతా తప్పనిసరి. 18-40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ స్కీంలో చేరవచ్చు. నెలవారీ, త్రైమాసికం, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన ఈ పెన్షన్‌కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అరవై ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ అందుబాటులో ఉంటుంది. పెన్షన్ తీసుకునే వ్యక్తి తర్వాత అతని లైఫ్ పార్ట్‌నర్‌కు పెన్షన్ తీసుకునే వ్యక్తి మృతి అనంతరం 60 ఏళ్ల వరకు సేకరించబడిన పెన్షన్ నిధి, చందాదారుని నామినీకి తిరిగి ఇస్తారు. వడ్డీ రాబడి 8 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications