రోజుకి రూ.500తో మహిళలకు సూపర్ స్కిం.. 15వేలు, కుట్టు మెషిన్, బ్యాంక్ లాన్ కూడా..
కేంద్ర ప్రభుత్వం తక్కువ ఆదాయం ఉన్నవారికి ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది. అయితే వీటిలో సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్న వారికొసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు ఇందుకు కావాల్సిన ట్రైనింగ్ కూడా అందించి వారికీ ఆర్ధిక సహాయం కూడా కల్పిస్తుంది. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి సిలై మెషిన్ యోజన.
ప్రధాన్ మంత్రి సిలై మెషిన్ యోజన కింద భారతదేశంలోని మహిళలు కుట్టు మిషన్లు కొనడానికి రూ. 15,000 అందిస్తున్నారు. ఈ చర్య ఉచిత శిక్షణ, శిక్షణ సమయంలో ఖర్చులకై ప్రతిరోజు రూ.500 కూడా ఉన్నాయి.

బట్టలు కుట్టే వారికీ కొత్త కుట్టు మిషన్ కొనేందుకు ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది. కుట్టు మిషన్ కోసం 15,000 రూపాయలతో పాటు ఉచిత ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా మహిళలను స్వావలంబన ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలు సొంతంగా టైలరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు బ్యాంక్ లోన్ కూడా పొందవచ్చు. దేశవ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ పథకాల్లో ఈ స్కిం ఒకటి.
ఎవరు అప్లయ్ చేసుకోవచ్చు ?
ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరిగా కొన్ని అర్హత ప్రమాణాలు మీకు ఉండాలి. దరఖాస్తు చేసుకునే మహిళ వయస్సు 20 నుండి 40 సంవత్సరాల మధ్య భారతీయ పౌరులై ఉండాలి. అలాగే బట్టలు కుట్టడం లేదా బట్టలు కుట్టే సంబంధించిన వ్యాపారంలో పని చేసి ఉండాలి. ఇంకా ఆమె కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి, కుటుంబ సభ్యులు ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించేవారై ఉండకూడదు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ కూడా ఉండకూడదు.
ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలంటే
ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవడానికి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ అప్షన్ పై క్లిక్ చేసి వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ ID అండ్ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ ఫామ్‌ను నింపడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు అవసరమైన డాకుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయండి. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత ఫామ్ ప్రింటౌ తీసుకొని తరువాత ప్రాసెసింగ్ కోసం ఆఫీసులో అందించాల్సి ఉంటుంది.
అవసరమైన డాకుమెంట్స్ : విద్యా అర్హత సర్టిఫికేట్ (ఏదైనా ఉంటే), ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, రెసిడెంట్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు


Click it and Unblock the Notifications