అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ మంగళవారం కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వైద్య సేవల సంస్థ, ఆర్థిక సేవల సంస్థ కలిసి హెల్త్ ఈఎంఐ కార్డును (Health EMI card) తీసుకు వచ్చాయి. వైద్య సేవలకు అయ్యే వ్యయాన్ని నెలవారీ వాయిదాలలో చెల్లించేందుకు ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్‌తో కలిసి కో-బ్రాండెడ్ హెల్త్ ఈఎంఐ కార్డును తీసుకు వచ్చినట్లు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది.

ఒకేసారి ఖర్చు భరించలేని వారికి ఈఎంఐ కార్డు ప్రయోజనం
హెల్త్ ఈఎంఐ కార్డు తీసుకుంటే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు ఛార్జీలు చెల్లించనవసరం లేదు. ఛార్జీల చెల్లింపు విషయంలో ఇబ్బంది పడకుండా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డు ఉంటే తమ వైద్య సేవల ఖర్చులను పన్నెండు నెలల వాయిదాలలో చెల్లించవచ్చు. ఒకేసారి చికిత్స ఖర్చులు భరించలేని వారికి ఇది ఎంతో ప్రయోజనం.

హెల్త్ ఈఎంఐ కార్డ్ ఇలా తీసుకోవచ్చు..
హెల్త్ ఈఎంఐ కార్డు ఉన్నవారికి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు డిస్కౌంట్ వోచర్స్, కూపన్స్ ఆఫర్ చేస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్యాన్సిల్ చెక్స్ సమర్పించి ఈ కార్డును తీసుకోవచ్చు.

అపోలో హాస్పిటల్స్‌లలో ప్రత్యేక కౌంటర్లు
బజాజ్ ఫిన్‌సర్వ్-అపోలో హాస్పిటల్స్ ఒప్పందం నేపథ్యంలో అపోలో ఆసుపత్రులలో బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఎండీ సునీతా రెడ్డి, బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్ ఈ కార్డును ఆవిష్కరించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications