కరోనా మహమ్మారి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మార్చి చివరి వారంలో పతనం అయ్యాయి. అన్-లాక్ తర్వాత పుంజుకొని, రికార్డు స్థాయిని తాకుతున్నాయి. దాదాపు రెండు వారాల పాటు లాభాల్లో ఉన్న మార్కెట్లు, నిన్న (బుధవారం) భారీ నష్టాలను నమోదు చేశాయి. సూచీలు నవంబర్ 25న 1.5 శాతం చొప్పున దిద్దుబాటుకు గురయ్యాయి. ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం కనిపించింది.
మార్చి కనిష్టాల నుండి సెన్సెక్స్, నిఫ్టీ 70 శాతం ఎగిశాయి. గత 14 సెషన్లలో సూచీలు 10 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. కరోనా సమయంలోను కొన్ని స్టాక్స్ తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ, మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి.

FIPల జోరు
సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే కాస్త సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. నవంబర్ నెలలో FIPలు భారీగా పెట్టుబడులు పెట్టడంతో సూచీలు ఎగిశాయి. రూ.55,553 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే నిన్న మార్కెట్లో దిద్దుబాటు చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో మరింత దిద్దుబాటు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు స్టాక్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఈ స్టాక్స్‌పై బెట్
- UTI అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్టాక్ టార్గెట్ ప్రైస్‌ను రూ.700గా అంచనా వేస్తోంది జేఎం ఫైనాన్షియల్. యూటీఐ ఏఎంసీ బలమైన బ్రాండ్ గుర్తింపు, రిటైల్ ఉనికి, ఈక్విటీ ఫండ్ పనితీరుతో నిరంతర పెరుగుదల, వ్యయ నియంత్రణతో లాభదాయకతలో మెరుగుదల కనిపిస్తోందని బ్రోకరేజీ సంస్థ చెబుతోంది.
- ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ స్టాక్స్ కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. యూపీ, బీహార్ రాష్ట్రాలలో దాదాపు 56 శాతం మార్కెట్ కలిగిన వీ మార్ట్ రిటైల్ మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది.

ఇవి కూడా..
ఎంపయాసిస్ రెండో ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలు నమోదు చేసింది. గత ఏడాది 259 మిలియన్ డాలర్లు కాగా, ఏడాది ప్రాతిపదికన ఈసారి 360 మిలియన్ డాలర్లుగా ఉంది. బలమైన పైప్‌లైన్, క్లయింట్ మైనింగ్‌లో సాధించిన విజయాలను ఉదహరిస్తూ ఈ స్టాక్ పుంజుకుంటుందని భావిస్తున్నారు.
శ్రీ దిగ్విజయ్ సిమెంట్ బలమైన బ్రాండ్ ఇమేజ్, చమురు బావి సిమెంట్ బ్రాండ్‌లో గుత్తాధిపత్యం, మంచి ఆపరేషనల్ సామర్థ్యం, మంచి మేనేజ్‌మెంట్ టీమ్ వంటి వివిధ కారణాలతో ఈ స్టాక్ కూడా ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటు హీడెల్‌బర్గ్ సిమెంట్స్, ఆల్కెమ్ ల్యాబ్స్, శారదా మోటార్ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. ఈ స్టాక్స్ 16 శాతం నుండి 50 శాతానికి పైగా రిటర్న్స్ ఇవ్వవచ్చునని చెబుతున్నారు.
యూటీఐ ఏఎంసీ 42 శాతం, శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ 28 శాతం, ఎంఫయాసిస్ 23 శాతం, శారదా మోటార్స్ ఇండస్ట్రీస్ 33 శాతం, ఆల్కెమ్ ల్యాబ్స్ 23 శాతం, వి మార్ట్ రిటైల్ 23 శాతం, సుదర్శన్ కెమికల్స్ 21 శాతం, హీడెల్‌బర్గ్ సిమెంట్ 16 శాతం మేర రిటర్న్స్ ఇస్తాయని అంచనా.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications