ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు రివార్డ్స్ 123 ప్లస్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్(Rewards123Plus)ను ప్రారంభించింది. అనేక రకాల డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌పై హామీ ఇచ్చే ప్రోత్సాహకాలతో పాటు ఇది డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ వార్షిక సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్లు తమ పాత రివార్డ్స్ 123 ప్లస్ ఖాతాను రివార్డ్స్123ప్లస్ అకౌంట్ డిజిటల్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు లేదా అప్ గ్రేడ్ చేయవచ్చు. ఈ టెలికం దిగ్గజం ప్రకటన మేరకు ఇండివిడ్యువల్స్ రూ.499తో Rewards123Plus వార్షిక సభ్యత్వం తీసుకోవచ్చు. ఈ అకౌంట్ తీసుకోవడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ప్రయోజనాలు
- Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం, Disney+ Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (worth రూ.499).
- లోడ్ మనీ బెనిఫిట్ - UPI యాప్ ద్వారా మనీని యాడ్ చేస్తే ప్రతి నెల ఫ్లాట్ INR 10 క్యాష్ బ్యాక్. (కనీస ట్రాన్సాక్షన్ మొత్తం INR 1,000).
పేమెంట్ బెనిఫిట్స్ - మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జ్, మొబైల్ పోస్ట్ పెయిడ్, బ్రాడ్ బాండ్, ల్యాండ్ లైన్, డీటీహెచ్ బిల్ పేమెంట్స్ పైన నెలకు ఫ్లాట్ INR 30 క్యాష్ బ్యాక్. (కనీస పేమెంట్ అమౌంట్ రూ.225)
- వడ్డీ రేటు - Rewards123Plus సేవింగ్స్ అకౌంట్ పైన కస్టమర్లు 6 శాతం వడ్డీ రేటును పొందుతారు. రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల బ్యాలెన్స్‌ల పైన, జీరో మినిమం బ్యాలెన్స్, అన్-లిమిటెడ్ డిపాజిట్స్ (ఆటో స్వీప్ ఫెసిలిటీ)పై ఇది వర్తిస్తుంది.
'కస్టమర్లు Rewards123Plusను ఓపెన్ చేయడం లేదా దీనికి అప్ గ్రేడ్ అయితే వారు వారి రిజిస్టర్డ్ నెంబర్ ద్వారా Disney+ Hotstar వెబ్ సైట్ (https://www.hotstar.com/in) లేదా app లోకి వెళ్లి సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో కస్టమర్లు Disney+ Hotstar విస్తృత లైబ్రరీని ఎనిమిది దేశీయ, అంతర్జాతీయ భాషల్లో చూడవచ్చు. అతిపెద్ద స్పోర్ట్స్ టోర్నమెంట్ ఐపీఎల్ 2021
లైవ్ స్ట్రీమింగ్ సౌకర్యం ఉంది' అని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు తెలిపింది.

అప్ గ్రేడ్ ఎలా చేయాలి?
- మొదట ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి లాగ్-ఇన్ కావాలి. బ్యాంకింగ్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.
- Rewards123Plus బ్యానర్ పైన క్లిక్ చేయాలి. లేదా Rewards123 Savings account పైన క్లిక్ చేయడానికి కాస్త కిందకు స్క్రోల్ చేయాలి.
- ఆప్షన్స్ నుండి Rewards123Plus ను ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ చేసి ప్రయోజనాలు అందుకోవచ్చు.

అక్కడి కంటే వడ్డీ రేటు ఎక్కువ
ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్ పైన ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా మూడు శాతం నుండి మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే ఈ వడ్డీ రేటు రోజు చివరి నాటికి లేదా రోజువారీ బ్యాలెన్స్ తగ్గుదల ఆధారంగా ఉంటుంది. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుతో రేట్లతో పోలిస్తే దేనిని ఎంచుకోవాలో మీకు అర్థమవుతుంది. మీ షార్ట్ టర్మ్ లేదా ఎమర్జెన్సీ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. Rewards123Plus సేవింగ్స్ పైన ఆరు శాతం వడ్డీ రేటు ఉంది. వివిధ బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఇది ఎక్కువ.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications