టెలికం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు మరో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇదివరకు రూ.599 రీఛార్జ్‌తో రూ.4 లక్షల బీమాను ఆఫర్ చేసింది. ఇప్పుడు రూ.2 లక్షల బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆదివారం నాడు (జనవరి 20, 2020) ప్రకటించింది.

రూ.179 ప్లాన్‌తో...
రూ.179 ప్లాన్ గడువు 28 రోజులు ఉంటుంది. 2GB డేటా వస్తుంది, 300 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. వీటితో పాటు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అందించే జీవిత బీమా ఈ ప్రీపేయిడ్ ప్యాక్‌తో లభిస్తుంది.

వీరికి ఇన్సురెన్స్ వర్తిస్తుంది
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్‌ను పరిమితంగా వినియోగించే వారిని, ఫీచర్ ఫోన్స్ వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. 18-54 మధ్య వయస్సు కలిగిన వారికి జీవిత బీమా వర్తిస్తుంది.

ఇన్సురెన్స్ అప్లై కావడానికి ఏవైనా అవసరమా?
రూ.2 లక్షల ఇన్సురెన్స్‌తో కూడిన రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ కోసం ఎలాంటి పత్రాలు లేదా వైద్య పరీక్షలు అవసరం లేదని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. బీమాకు సంబంధించిన పాలసీ పత్రాలను తక్షణమే డిజిటల్ రూపంలో పంపిస్తామని తెలిపింది. అవసరమైతే కాగితం రూపంలోను అందిస్తామని పేర్కొంది. జీవిత బీమాతో కూడిన ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు అనూహ్య స్పందన వస్తున్నట్లుగా పేర్కొంది.

ఇదివరకే రూ.599 ప్లాన్
ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం గత ఏడాది రూ.4 లక్షల విలువైన జీవిత బీమాతో కూడిన రూ.599 ప్లాన్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రూ.599తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా, ఏ నెట్ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. ఈ పథకం రీఛార్జ్ కాలపరిమితి 84 రోజులు. బీమా కాలపరిమితి కూడా మూడు నెలల పాటు కొనసాగుతుంది. రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి జీవిత బీమా కాలం పొగిడిస్తారు. 18-54 మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications