PNB: గుడ్ న్యూస్ చెప్పిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. లోన్లపై ప్రత్యేక ఆఫర్లు..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) సోమవారం నాడు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో తన పండుగ రిటైల్ రుణాల ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. గృహ రుణాలు, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలు, ఇతర రిటైల్ క్రెడిట్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ప్రయోజనాలతో, వినియోగదారులు తమ పండుగ ఆకాంక్షలను నెరవేర్చుకోవడాన్ని సులభతరం చేయడానికి రుణాలు ఆఫర్ చేస్తోంది. పీఎన్‌బీ ఉత్సవ్ ఫెస్టివిటీస్ 2026 పేరుతో ప్రత్యేక ఫెస్టివ్ రిటైల్ లోన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
గృహ రుణాల విషయానికి వస్తే, కార్డ్ రేటుపై 5 బేసిస్ పాయింట్ల (bps) రాయితీతో పాటు, అప్‌ఫ్రంట్ మరియు ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేస్తామని పేర్కొంది. కారు లోన్‌లకు కూడా అప్‌ఫ్రంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపింది. ఏ బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీలో లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఇతర ఛార్జీలు ఉంటాయి. వాటిని మనకు ఇచ్చే లోన్ లో కట్ చేసుకుని మిగతాది ఇస్తారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్‌బీ ఉత్సవ్ ఫెస్టివిటీస్ 2026 భాగంగా కొన్ని ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపింది. దీంతో కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకునే వారికి ఆ లోన్ పై అప్‌ఫ్రంట్, ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు.. కార్డ్ రేటుపై 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్లు వివరించింది. అర్హత కలిగిన కస్టమర్లకు లోన్ తీసుకునే సమయంలో ప్రయోజనం పొందుతారని బ్యాంక్ ప్రకటించింది. వెహికిల్ లోన్ తీసుకోవాలనుకునే వారికి కూడా అప్‌ఫ్రంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. దీంతో పండుగ సమయంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ప్రారంభంలో చెల్లించాల్సిన అదనపు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు మీ దగ్గరలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంప్రదించాలని బ్యాంక్ అధికారులు తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
