LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకోవాలంటే?
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా నిలవనున్న ఎల్ఐసీ ఐపీవోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు 6 కోట్ల మంది పాలసీదారులు దీనిపై ఆసక్తి కొద్ది తమ పాలసీలను పాన్‌తో లింక్ చేసుకున్నారు. అంటే మొత్తం రూ.21వేల కోట్లను సమీకరించే ప్రణాళికతో ఎల్ఐసీ వస్తోంది. మెజార్టీ ఇన్వెస్టర్లు, పాలసీదారులు ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. షేర్ వ్యాల్యూ తక్కువగా ఉండటం, కంపెనీకి మంచి పేరు ఉండటం కలిసి వస్తోంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు ప్రయివేటు కంపెనీల నుండి పోటీ, సంప్రదాయ పద్ధతుల్లో పాలసీ జారీ వంటివి చూడాలని భావిస్తున్నారు.
2021లో ఐపీవోల రూపంలో వివిధ కంపెనీలు రూ.1 లక్ష కోట్ల మేర సమీకరించాయి. 2022లో మాత్రం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీంతో ఎల్ఐసీ పరిమాణం తగ్గింది. గతంలో HDFC ఇన్సురెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు ఐపీవోకు రాగా వాటి ఎంబెడెడ్ వ్యాల్యూను 3.4 రెట్లుగా లెక్కించారు. కాబట్టి ఈ విషయంలో ఎల్ఐసీ షేర్లను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చునని, ఇది ఓ సదవకాశం అంటున్నారు.

ఎల్ఐసీ ఐపీవో మే 4న ప్రారంభమవుతుంది. ఐపీవో 9వ తేదీన ముగుస్తుంది. ధరల శ్రేణి రూ.902 నుండి రూ.949 మధ్య ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 తగ్గింపు, పాలసీదారులకు రూ.60 తగ్గింపు వర్తిస్తుంది. ఒక లాట్‌కు పదిహేను షేర్లు. గరిష్టంగా 14 లాట్‌లు అంటే 210 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతా ఉండాలి. మీకు ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు. కొత్తగా మరొకటి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎల్ఐసీ పాలసీదారులకు రూ.60 తగ్గింపుతో షేర్లు కేటాయిస్తుంది. దీనిని పొందాలంటే ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ నాటికి ఏదో ఒక ఎల్ఐసీ పాలసీ ఉండాలి. గ్రూప్ పాలసీలో సభ్యులుగా ఉన్న వారు ఈ కోటా కిందకు రారు. పాలసీకి పాన్‌ను ఫిబ్రవరి 28వ తేదీ లోపు అనుసంధానం చేసి ఉండాలి.


Click it and Unblock the Notifications