ఈ మధ్యకాలంలో చాలామంది తమ డబ్బును సురక్షితంగా పెట్టుబడి చేయాలని చూస్తున్నారు. అలాంటి వారు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇవి ప్రభుత్వ హామీతో ఉండటమే కాకుండా, ట్యాక్స్ మినహాయింపు, మంచి వడ్డీ రేట్లు లాంటి ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. చిన్న మొత్తాలతో ప్రారంభించి, దీర్ఘకాలికంగా సేవింగ్స్ చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు బాగా ఉపయోగపడతాయి. కానీ స్కీమ్‌లు చాలా ఉండటంతో, ఏది తీసుకోవాలి? ఎందులో లాభం ఎక్కువ? అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. అందుకే 2025-26లో ముఖ్యమైన టాప్ 5 పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లు ఏవో, వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
1. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ అనేది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లా పనిచేస్తుంది. ఇక్కడ 1,000 రూపాయల కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు మరియు 1 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిలో డిపాజిట్ చేయొచ్చు. స్కీమ్‌పై దాదాపు 6.9% నుండి 7.5% వరకు వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా 5 సంవత్సరాల డిపాజిట్‌పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. జాయింట్ ఖాతా, మైనర్ ఖాతా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్ వార్షిక వడ్డీ చెల్లింపుతో వస్తుంది, అందువల్ల ఆదాయంగా తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)
ఇది మధ్య తరగతి ప్రజలకు అనువుగా ఉండేలా రూపొందించబడిన పొదుపు పథకం. ఈ స్కీమ్ లో కనీసం 1,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు మరియు 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ప్రస్తుతానికి దీనిపై సుమారు 7.7% వడ్డీ లభిస్తుంది. వడ్డీపై పన్ను వర్తించినా, డిపాజిట్ అయిన మొత్తం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. దీర్ఘకాలిక పొదుపుకు, పన్ను మినహాయింపుతో కూడిన భద్రమైన స్కీమ్ కావాలనుకునేవారికి ఇది స్కీమ్ ఒక మంచి ఎంపిక.
3. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS)
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది నెల నెలకు స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారి కోసం రూపొందించబడింది. ఈ స్కీమ్‌లో మీరు పెట్టుబడి చేసిన మొత్తంపై ప్రతి నెల వడ్డీ రూపంలో డబ్బు లభిస్తుంది. ప్రస్తుతం దీని వడ్డీ రేటు సుమారు 7.4% (2025-26). కనీస పెట్టుబడి 1,000 రూపాయలు కాగా, గరిష్ట పరిమితి 9 లక్షలు (సింగిల్ అకౌంట్‌కి) మరియు 15 లక్షలు (జాయింట్ అకౌంట్‌కి). ఉదాహరణకు రూ. 4 లక్షలు డిపోసిట్ చేస్తే నెలకు రూ. 2,467 వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ పై పన్ను మినహాయింపు లేదు.
4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది 60 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కీమ్. ఇది వృద్ధులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కలిగించే లక్ష్యంతో రూపొందించబడింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు సుమారు 8.2% గా ఉంది. గరిష్ట పెట్టుబడి పరిమితి ₹30 లక్షలు. ప్రతి త్రైమాసికంకి వడ్డీ చెల్లింపుగా వస్తుంది. అదనంగా, డిపాజిట్ చేసిన మొత్తం 80C కింద పన్ను మినహాయింపు పొందుతుంది. 5 సంవత్సరాల తర్వాత మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఇది వృద్ధులకి ఒక ఉత్తమమైన పథకం.
5. సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఈ స్కీమ్‌ను కేవలం బాలికల భవిష్యత్తు కోసం మాత్రమే రూపొందించారు. సుకన్య సమృద్ధి యోజన కింద, బాలిక 10 ఏళ్లు దాటకముందు ఖాతా ప్రారంభించాలి. కనీస పెట్టుబడి ₹250, గరిష్టం ₹1.5 లక్షల వరకూ ఏడాదికి డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌కి ప్రస్తుత వడ్డీ రేటు సుమారు 8.2% (2025-26), ఇది ఇతర పొదుపు పథకాల కంటే ఎక్కువగా ఉంటుంది. 21 ఏళ్ల తర్వాత లేదా బాలిక పెళ్లయిన తర్వాత ఖాతా మూసివేయవచ్చు. దీనిపై లభించే వడ్డీ కూడా పన్ను మినహాయింపు పొందుతుంది. ఇది బాలికల విద్య మరియు పెళ్లికి ధనాన్ని సురక్షితంగా పొదుపు చేసే గొప్ప మార్గం.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లు ప్రభుత్వ హామీతో ఉండడం వల్ల అత్యంత భద్రమైన పెట్టుబడిగా పరిగణించబడుతున్నాయి. చిన్న మొత్తాలతోనే ప్రారంభించవచ్చు కాబట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ స్కీమ్‌లు మరింత అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ స్కీమ్‌లలో ఆదాయపు పన్ను మినహాయింపు (80C కింద) కూడా లభిస్తుంది. కొన్ని పథకాల్లో నెలవారీ, త్రైమాసికంగా స్థిర ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయబడినందున వృద్ధులకు ఇది అత్యంత ఉపయోగపడుతుంది. వడ్డీ రేట్లు బ్యాంకుల కంటే కొంచెం మెరుగుగా ఉండటమే కాకుండా, ఈ స్కీమ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్‌లలో సులభంగా అందుబాటులో ఉంటాయి. మొత్తానికి, భద్రత, స్థిర ఆదాయం, పన్ను మినహాయింపు వంటి లక్షణాలతో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లు దీర్ఘకాలిక పెట్టుబడికి మంచి ఎంపికగా నిలుస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications