Fixed Deposits: అక్టోబర్ 1 నుంచి మారనున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల నిబంధనలు..!
అక్టోబర్ 1 నుండి అనేక కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. వీటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDs)కు సంబంధించిన పలు మార్పులు చేయనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) FD నిబంధనలలో ముఖ్యమైన మార్పులు చేసింది. ఇవి 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులలో వడ్డీ రేట్లకు సంబంధించిన అంశాలు, ఇతర ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొన్ని ముఖ్య వివరాలు ఇవే.
రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను 'బల్క్ డిపాజిట్లు'గా పరిగణిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఇప్పుడు లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) విధానం కింద బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు కల్పించడం కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లను తమ వెబ్‌సైట్‌లలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లను ప్రతి పని దినం ఉదయం 10 గంటల లోపు బ్యాంక్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి.

తాజా వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10:10 గంటల లోపు అప్‌డేట్ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకే రోజున బుక్ చేసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఖచ్చితంగా ఒకేలా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ ఏ శాఖలోనైనా, ఒకే రోజున బుక్ చేసుకున్న ఒకే మొత్తానికి సంబంధించిన FDల వడ్డీ రేట్లలో ఎటువంటి తేడా (వివక్ష) ఉండకూడదు. ఆర్బీఐ కొత్త నిబంధనలు ప్రధానంగా బల్క్ డిపాజిట్లకు సంబంధించినవి కాబట్టి, సాధారణ రిటైల్ పెట్టుబడిదారులపై వీటి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
ఈ ఆర్బీఐ నిబంధనలు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతాయి. అలాగే పెట్టుబడిదారులు FD వడ్డీ రేట్లపై రోజువారీ సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) అనేక ఇతర పెట్టుబడి మార్గాల కంటే సురక్షితమైనవిగా భావిస్తారు. ఎఫ్డీలు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ సిటిజన్లలో FDలు బాగా ఆదరణ పొందాయి. ఎందుకంటే సాధారణ పెట్టుబడిదారుల కంటే వారికి సాధారణంగా అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. బ్యాంకుల మధ్య వడ్డీ రేట్లు మారుతూ ఉన్నప్పటికీ, FDలు సాధారణంగా 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
