Gold Loans: బంగారం రుణాల్లో దూసుకెళ్తున్న ఫైనాన్స్ కంపెనీలు..!
బంగారం రుణాల్లో బ్యాంకుల కంటే ఎన్భీఎఫ్సీలు దూసుకెళ్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఎల్&టి ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థల గోల్డ్ లోన్లు ఇవ్వడంలో ముందున్నాయి. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు తమ బంగారు రుణాల ఇస్తున్నా.. బజాజ్ ఫైనాన్స్ (బిఎఎఫ్), ఎల్&టి ఫైనాన్స్ (ఎల్‌టిఎఫ్), శ్రీరామ్ ఫైనాన్స్ (ఎస్‌హెచ్‌ఎఫ్‌ఎల్) వంటి వైవిధ్యభరితమైన ఎన్‌బిఎఫ్‌సిలు పోటీని పెంచుతున్నాయి. పోటీని తీవ్రతరం చేస్తున్న సంస్థలలో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి ఇతర సంస్థలను కూడా ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం జూలైలో బ్యాంకేతర ఆర్థిక సంస్థల (NBFCs) బంగారు ఆభరణాలపై రుణాలు 68.5% వృద్ధిని నమోదు చేశాయి. ఇది అంతకుముందు 43.9 శాతంగా ఉంది. బంగారు రుణ విభాగంలో సింహభాగం వాటాను కలిగి ఉన్న బ్యాంకుల విషయంలో మాత్రం వృద్ధి రేటు తగ్గింది. 136.4 శాతం నుంచి 88.1 శాతానికి తగ్గింది. సోమవారం రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వినియోగదారుల మన్నికైన వస్తువుల కొనుగోలు కోసం ఇచ్చే రుణాలు జూలైలో 51.5 శాతం పెరిగాయి. ఇది జూన్‌లో ఇది 46.8 శాతంగా ఉండేది. ఏడాది క్రితం ఇదే కాలంలో కేవలం 18.8%గా ఉండేది.

జూలై చివరి నాటికి, NBFCల (బ్యాంకేతర ఆర్థిక సంస్థల) వద్ద ఉన్న మొత్తం బంగారు రుణాల విలువ దాదాపు రూ. 3.54 లక్షల కోట్లుగా ఉండగా, బ్యాంకుల వద్ద ఇది రూ. 5.52 లక్షల కోట్లుగా నమోదైంది. బంగారం ఆధారిత రుణాలకు పెరిగిన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, బ్యాంకేతర సంస్థల రిటైల్ రుణ విభాగంలో ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా నిలిచింది. జూలైలో NBFCల మొత్తం రుణాల విలువ 14.9% పెరిగి రూ. 59.89 లక్షల కోట్లకు చేరింది. NBFCల రుణ వితరణలో గణనీయమైన వాటా కలిగిన రిటైల్ రుణాలు,జూలై నెలలో 21.4% వృద్ధిని నమోదు చేశాయి. రిటైల్ రుణాలలో, గృహ రుణాలు ఏడాది క్రితం ఉన్న 4% వృద్ధికి భిన్నంగా 11.9% పెరిగి రూ. 8.55 లక్షల కోట్లకు చేరాయి. వాహన రుణాలు 15.1% వద్ద దాదాపు స్థిరంగా ఉండగా, వినియోగ వస్తువుల కోసం తీసుకునే రుణాలు 51.5% పెరిగాయి.
పారిశ్రామిక రంగానికి అందించిన రుణాలు ఏడాది క్రితం ఉన్న 9.3 శాతానికి పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఈ విభాగంలో కీలకమైన మౌలిక సదుపాయాల రంగంలో వృద్ధి మందగించడమని నిపుణులు చెబుతున్నారు. మొత్తం రిటైల్ రుణాల వృద్ధి గణనీయంగా పెరిగిందని RBI గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. గృహ, బంగారు రుణాల జోరుతో, రిటైల్ రుణాల విలువ ఏడాది క్రితం ఉన్న రూ. 21.46 లక్షల కోట్ల నుంచి జూలై నాటికి రూ. 26.06 లక్షల కోట్లకు పెరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్-లోన్ ఎన్‌బిఎఫ్‌సి అయిన ముత్తూట్ ఫైనాన్స్, మారుతున్న వాతావరణానికి ఒక ముందస్తు సూచనను అందిస్తోంది. 1QFY27లో దీని ఏకీకృత AUM రూ.1.9 ట్రిలియన్లుగా ఉంది. ఇందులో గోల్డ్ లోన్‌ల వాటా సుమారు 91 శాతంగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
