కరోనా వైరస్ నేపథ్యంలో అందరిలోనూ ఆరోగ్య బీమాపై ఆవగాహన పెరిగింది. ఎక్కువమంది తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండటం కోసం రూ.1 కోటి టర్మ్ ఇన్సురెన్స్ పాలసీని తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్ట్ మధ్య రూ.1 కోటి అంతకు మించిన ఇన్సురెన్స్ కవర్‌ను ఎంచుకున్నట్లు ఇన్సురెన్స్ అగ్రిగేటర్ పాలసీబజార్ డాట్ కామ్ డేటా వెల్లడిస్తోంది. కరోనా నేపథ్యంలో చాలామంది హెల్త్ ఇన్సురెన్స్ పైన దృష్టి సారించారు. పాలసీబజార్ సేకరించిన సమాచారం మేరకు ఏప్రిల్-ఆగస్ట్ 2020-21లో 50 శాతం కస్టమర్లు కోటి రూపాయల పాలసీల వైపు మొగ్గు చూపారు.

రూ.1,000 ప్రీమియం.. అందుకే రూ.1 కోటి బీమా వైపు
నెలకు రూ.1,000 ప్రీమియం కావడంతో చాలామంది రూ.1 కోటి పాలసీ వైపు మొగ్గుచూపుతున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం అనిశ్చితి సమయాల్లో ఎక్కువమంది బీమా కవరేజీ తీసుకునేలా ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది టర్మ్ పాలసీ కొనుగోళ్లలో 42 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్య వ్యక్తులు 77 శాతం పెరిగారు. టర్మ్ పాలసీల సంఖ్యలో 31 ఏళ్ల నుండి 35 ఏళ్ల వయసున్న వ్యక్తులు 30 శాతంతో ఎక్కువ భాగం ఉన్నారు.

ఉద్యోగులు.. స్వయంఉపాధి విభాగం
స్వయం ఉపాధి విభాగంలో 41 శాతం మంది రూ.50 లక్షల బీమా, 40 శాతం మంది రూ.1 కోటి బీమాకు మొగ్గుచూపారు. ఉద్యోగుల్లో 40 శాతం మంది రూ.1 కోటి బీమా, 10 శాతం మంది రూ.2 కోట్ల బీమా వైపు మొగ్గు చూపారు. 35 శాతం మంది రూ.50 లక్షల బీమా కేవరేజీని ఎంచుకున్నారు. 'రూ.1 కోటి బీమా కవర్ చాలా సరసమైన ధరకు రూ.1,000కే లభిస్తోందని, అందుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు' అని తెలిపింది.
హై-నెట్ ఇండివిడ్యువల్స్(HNI) సెగ్మెంట్‌లో 80 శాతం మందికి పైగా కస్టమర్లు రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ కవరేజీకి మొగ్గు చూపినట్లు తెలిపింది. ఇందులో 25 శాతం మంది రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల కవర్ బ్రాకెట్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది.

టర్మ్ మార్కెట్‌లో మార్పులు
కరోనా మహమ్మారి సృష్టించిన అనిశ్చితులు, ఆర్థిక ఇబ్బందులు, IRDAI బీమాపై తీసుకున్న చొరవవంటి అంశాలు ఇలాంటి పరిస్థితుల్లో బీమా కవరేజీని పొందడానికి, కుటుంబాలకు ఆర్థిక బ్యాకప్ అందించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది టర్మ్ మార్కెట్‌లో భారీగా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications