Gold Loans: భారీగా పెరిగిన బంగారం రుణాలు.. వడ్డీ తక్కువగా ఉండడమే కారణమా..!
గత మూడేళ్లలో భారతదేశపు బంగారు రుణాల మార్కెట్ పరిమాణం దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఎక్కువ మంది వినియోగదారులు బంగారం ఆధారిత రుణాల వైపు మొగ్గు చూపడం, ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు అదనపు రుణాల తీసుకోవడం వల్ల గోల్డ్ లోన్లు పెరిగాయి. ఆగస్టు 2026 నాటికి బకాయి ఉన్న మొత్తాలు రూ.22.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నవంబర్ 5న విడుదలైన ట్రాన్స్యూనియన్ సిబిల్ వారి 'లెండింగ్ అన్లాక్డ్ గోల్డ్ లోన్స్' నివేదిక ప్రకారం, ఆగస్టు 2026 నాటికి క్రియాశీల బంగారు రుణగ్రహీతల సంఖ్య 5.5 కోట్లుగా ఉంది. అధిక విలువ గల రుణాల వైపు ఈ మార్పు, రుణాల పంపిణీ ధోరణులలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
జూన్ 2026తో ముగిసిన మూడు నెలల కాలంలో బంగారు రుణాల మంజూరు విలువలు గతేడాదితో పోలిస్తే (YoY) 12 శాతం పెరిగి రూ.8.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే రుణాల జారీ పరిమాణం 15 శాతం తగ్గింది. ఈ కాలంలో దాదాపు 3.7 కోట్ల బంగారు రుణాలు అందించారు. ప్రత్యేక రుణగ్రహీతల సంఖ్య 2.4 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. రూ.2.5 లక్షలకు పైబడిన రుణాల జారీ పరిమాణంలో గతేడాదితో పోలిస్తే 19 శాతం పెరుగుదల నమోదైంది. ఇది రుణగ్రహీతలు తమ బంగారంపై అధిక రుణ మొత్తాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారని సూచిస్తోంది. జూలై 2023 నుంచి జూన్ 2025 మధ్య బంగారు రుణం తీసుకున్నవారు తక్కువగా ఉన్నారు.

ఆ తర్వాతి 12 నెలల్లోపు మళ్లీ రుణం తీసుకున్నవారు పెరిగారు. రూ.2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ రుణాలు తీసుకున్న రుణగ్రహీతలలో 57% మంది ఒక సంవత్సరంలోపు మరో బంగారు రుణం తీసుకున్నారు. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారిలో ఈ వాటా 54%గా ఉంది. బంగారం ధరలు పెరగడం వల్ల రుణాలు తీసుకునే వారు పెరిగారు. ఏప్రిల్-జూన్ 2026 త్రైమాసికంలో జారీ అయిన బంగారు రుణాలలో మూడింట రెండు వంతులు సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఐదు బంగారం రుణాల్లో మహిళలు ఇద్దరు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే జెన్ జెడ్ (Gen Z) రుణగ్రహీతల సంఖ్య 19 శాతం పెరిగింది.
800 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలు మార్కెట్లో 40% వాటాను కలిగి ఉన్నారు. ఇది జూన్ 2023తో ముగిసిన త్రైమాసికం నుంచి నాలుగు శాతం పాయింట్లు ఎక్కువ. భారతదేశ బంగారు రుణ మార్కెట్కు దక్షిణ రాష్ట్రాలు పునాదిగా కొనసాగుతున్నప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి కూడా వృద్ధి పెరుగుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications