Mutual Funds: మార్కెట్స్ క్రాష్ వేళ SWPకి డిమాండ్.. అసలేంటీ SWP.. SIP మరియు SWP మధ్య తేడా..
SIP vs SWP: స్టాక్ మార్కెట్లలో వస్తున్న భారీ లాభాలను చూసి ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది. నెలనెలా చిన్న మొత్తంలోనూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటంతో ఇదొక అనువైన ఇన్వెస్ట్‌మెంట్ మార్గంగా భావిస్తున్నారు. అయితే వీటిలోనూ SIP మరియు SWP అనే రెండు పదాలు వినిపిస్తూ ఉంటాయి కానీ వాటి గురించి చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు.
మ్యూచువల్ ఫండ్స్ భారీ రిటర్నులను జనరేట్ చేయడానికి ముఖ్య కారణం ఆర్థిక క్రమశిక్షణ అని చెప్పవచ్చు. ప్రతినెలా ఓ క్రమపద్ధతిలో SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెడుతుండటం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ పొందవచ్చు. తద్వారా మార్కెట్లు పెరుగుతూ పోతున్న వేళ SIP చేస్తూ భారీ కార్పస్ సృష్టించవచ్చు.

SWP (సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్) మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు, ఫండ్స్ సరిగా పెర్ఫార్మ్ చేయని సమయంలో దీని అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే అవి తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అదే టైంలో డబ్బు అవసరం అయితే మొత్తం పోర్ట్‌ఫోలియోని విక్రయించాల్సిన అవసరం లేకుండా SWP సహాయపడుతుంది.
SIP ఇన్వెస్ట్‌మెంట్ సాధనం అయితే SWP విత్‌డ్రాయల్ ప్రొడక్ట్. రెండింటి కలయికను సరిగ్గా వినియోగిస్తే సులభంగా క్రమశిక్షణతో కూడిన ఆర్థిక స్వాతంత్ర్యం సొంతం అవుతుంది. మార్కెట్లలో హెచ్చుతగ్గులకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రారంభ పెట్టుబడి తక్కువే అయినా ఆదాయం పెరిగేకొద్దీ పెట్టుబడిని పెంచుతూ పోతే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మంచి రిటర్న్స్ జనరేట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications