Bengaluru News: నెలకు రూ.2.5 లక్షల జీతం ఉన్నా అప్పులు చేయాల్సి వస్తుందన్న వ్యక్తి..

బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి, అతని భార్య కలిసి నెలకు రూ. 2.5 లక్షల జీతం తీసుకుంటున్నారు. వారు పెద్దగా పార్టీలకు వెళ్లరు, బయట తినడం చాలా అరుదు. సాధ్యమైనంత సాదాసీదాగా జీవించడానికి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ ఆ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుంది. మంచి జీతం వచ్చినప్పటికీ వరుసగా వచ్చిన పెద్ద ఖర్చులు వారిని అప్పులు తీసుకునేలా చేశాయి. పెళ్లి, ఇంటి పునరుద్ధరణ, పెరుగుతున్న క్రెడిట్-కార్డ్ బిల్లులు తనను ఇబ్బందుల్లోకి నెట్టాయని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అధిక జీతం ఉన్నంత మాత్రాన ఆర్థిక భద్రత ఉంటుందని చెప్పలేమనే వాస్తవాన్ని ఈ పోస్ట్ గుర్తుచేస్తుంది.

తనకు నెలకు ఎంత ఖర్చు వస్తుందో ఆ వ్యక్తి వివరించాడు. పన్నులు పోను తమ కుటుంబం ఉమ్మడి నెలవారీ ఆదాయం రూ. 2.5 లక్షలని ఆ వ్యక్తి తెలిపాడు. కానీ అందులో గణనీయమైన భాగం ఈఎంఐలు (EMIs), ఇతర స్థిరమైన ఖర్చులకే సరిపోతోందని పేర్కొన్నాడు. ఇంటి ఈఎంఐ రూ. 35,000, వ్యక్తిగత రుణ ఈఎంఐ రూ. 16,000, కార్ లోన్ ఈఎంఐ రూ. 15,000, బెంగళూరులో ఇంటి అద్దె రూ. 37,000, క్రెడిట్-కార్డ్ బిల్లులు దాదాపు రూ. 70,000, సరుకులు రూ. 15,000, సిప్ పెట్టుబడులు రూ. 15,000, బయట తినడం రూ. 4,000, సినిమాలు, వినోదం రూ. 2,000 ఖర్చు చేస్తానని పేర్కొన్నాడు.

Debts

వీటన్నింటినీ కలిపితే నెలకు సుమారు రూ. 2.09 లక్షలు అవుతుంది. అత్యవసర పరిస్థితులు లేదా ఊహించని ఖర్చులను పరిగణనలోకి తీసుకోకముందే చేతిలో కేవలం రూ. 41,000 మాత్రమే మిగులుతున్నాయని వివరించాడు. తనకు వరుసగా రెండు పెద్ద ఖర్చులు రావడంతో ఈ ఆర్థిక ఒత్తిడి మొదలైందని పేర్కొన్నాడు. తన వివాహానికి రూ. 30 లక్షలకు పైగా ఖర్చయిందని తెలిపాడు. ఇందులో కొంత భాగాన్ని తన వద్ద ఉన్న షేర్లను అమ్మడం ద్వారా సమకూర్చుకున్నట్లు చెప్పాడు. చివరి నిమిషంలో నగదు కొరత ఏర్పడటంతో 9.1% వడ్డీ రేటుతో రూ. 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. అదే సమయంలో అతని కుటుంబం తమ ఇంటిని రూ. 35 లక్షల ఖర్చుతో పునరుద్ధరించిందని గుర్తు చేశాడు. ఇందుకోసం తన పొదుపు నుండి రూ. 15 లక్షలు వెచ్చించగా, మరో రూ. 20 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

కారు రుణం కూడా ఉన్నట్లు చెప్పాడు. దీనికి సంబంధించి ఇంకా దాదాపు రూ. 3 లక్షలు చెల్లించాల్సి ఉందని చెప్పాడు. క్రెడిట్ కార్డ్ ద్వారా నెలకు సగటున రూ. 70,000 ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు.
తన తల్లిదండ్రులు ఆర్థికంగా తనపైనే ఆధారపడి ఉన్నారని, సరుకులు, ఇతర ఖర్చుల కోసం వారు తన క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తారని అతను చెప్పాడు. కాగితంపై చూస్తే, నెలకు రూ. 2.5 లక్షల కుటుంబ ఆదాయం అనేది చాలా మంచి మొత్తం అనిపిస్తుందని కానీ.. అప్పుల వల్ల చివరికి తక్కువ మొత్తం మిగులుతుందని పేర్కొన్నాడు. ఇల్లు, వ్యక్తిగత రుణం, కారు కోసం ఆ కుటుంబం ప్రతి నెలా రూ. 66,000 EMIలుగా చెల్లిస్తోంది. దీనికి అద్దె, సాధారణ క్రెడిట్ కార్డ్ ఖర్చులను జోడిస్తే, సరుకులు, అత్యవసర పరిస్థితులు లేదా ఇతర ప్రాథమిక అవసరాల గురించి ఆలోచించే ముందే వారి ఆదాయంలో పెద్ద భాగం అయింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+