Credit Card: రూ.431 చెల్లించనందుకు రూ.30, 437 కట్టమన్నారు.. వినియోగదారుడికి షాకిచ్చిన బ్యాంక్..!
క్రెడిట్ కార్డు వాడడం రోజు రోజుకు పెరుగుతోంది. చాలా మంద క్రెడిట్ కార్డు వాడుతున్నారు. ఒక్కొక్కరు రెండేసి, మూడేసి క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డులు బిల్లులు క్రమంగా తప్పుకుండా చెల్లించాలని కోరుతున్నారు. రూపాయి కట్టకున్నా.. దానిపై వడ్డీ వడ్డీ వేసి రూ. వేలు వసూలు చేసే అవకాశం ఉంది. తాజాగా ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు బిల్లులు రూ.431 తక్కువగా చెల్లించాడు. హెచ్ఎస్‌బీసీ బ్యాంకు ఆ కస్టమర్‌కు బ్యాంక్ ఏకంగా రూ.30 వేలు అదనపు ఛార్జీలు కట్టాలని స్పష్టం చేసింది. రెడిట్ యూజర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రెడిట్ కార్డు యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
ఒక రెడిట్ యూజర్ తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు రూ.4లక్షల 17వేల 770 వచ్చిందని.. గడువు తేదీలోపు రూ.4లక్షల 17వేల 339 చెల్లించాడు. అయితే మొత్తం బిల్లులో కేవలం రూ.431 మాత్రమే పెండింగ్ లో పెట్టారు. కానీ ఆ చిన్న మొత్తాన్ని సకాలంలో పూర్తిగా చెల్లించనందుకు బ్యాంక్ విధించిన ఛార్జీలు చూసి క్రెడిట్ కార్డు వినియోగదారుడు షాక్ అయ్యాడు. కేవలం రూ.431 చెల్లించనందుకు బ్యాంక్ ఏకంగా రూ.25వేల 794 ఫైనాన్స్ ఛార్జీలు వసూలు చేసింది. అంతేకాకుండా ఆ ఛార్జీలపై రూ.4 643 GST కూడా కట్టాలని స్పష్టం చేసింది. దీంతో జస్ట్ రూ.431 కాస్తా రూ.30వేల 437కి పెరిగింది.

బ్యాంక్ యాప్ సరిగ్గా చూపకపోవడం వల్లే తాను రూ.431 చెల్లించలేకపోయానని వినియోగదారుడు పేర్కొన్నాడు. అందుకే ఈ పొరపాటు జరిగిందని వివరించాడు. తాము ఎన్నిసార్లు పార్ట్-పేమెంట్‌లు చేసినప్పటికీ.. అసలు ఎంత బకాయి ఉందనే విషయాన్ని యాప్ స్పష్టంగా చూపలేదని పేర్కొన్నాడు. ఏ చిన్న పెండింగ్ ఉన్నా.. గడువు తేదీలోపు పూర్తి బిల్లు కట్టకపోతే జరిగే నష్టానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని వివరించాడు. అందుకే క్రెడిట్ కార్డు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. గడువు తేదీలోపు ఫుల్ బిల్లు చెల్లించకపోతే కేవలం బకాయి ఉన్న మొత్తంపైనే కాకుండా, తర్వాత చేసే కార్డు పేమెంట్స్ కూడా మొదటి రోజే వడ్డీ పడటం స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలని సూచించారు.
చాలా మంది కస్టమర్లకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో అలసత్వ వహిస్తారు. ఇలా చేయకూడదని సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ లో 30 శాతం వరకు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. అలాగే రెండుకు మించి క్రెడిట్ కార్డులు వాడొద్దని హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
