దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందిస్తోంది. అదే విధంగా చేతివృత్తుల వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రధాని మంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద చేతివృత్తిదారులకు 5 శాతం చొప్పున రూ.3 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఇలాంటి లోన్ పై ప్రభుత్వం 8% వరకు సబ్సిడీని కూడా అందిస్తుంది.
వడ్రంగులు, స్వర్ణకారులు, రాతి శిల్పులు, కమ్మరులు, కుమ్మరులు, క్షౌరవులు, నావికులు మొదలైన వారికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఈ పథకం ద్వారా లోన్లు ఇస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పీఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించింది.

ప్రధమ మంత్రి విశ్వకర్మ యోజన కింద చేతివృత్తులవారు మొదట రూ. 1 లక్ష లోన్ ఇస్తారు. దానిని 18 నెలల్లో ప్రతినెల టైంకి కట్టిన తర్వాత రూ. 2 లక్షల లోన్ తీసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ లోన్లపై వడ్డీ రేటు 5 శాతం.
ఈ పథకానికి అప్లయ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి భారతదేశ పౌరుడై ఉండాలి. అతని వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. PMEGP, PM SVANIdhi, ముద్ర లోన్ పథకాల ద్వారా లోన్ తీసుకొని ఉండకూడదు. ఇందుకు ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డు, రెసిడెంట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం.
వడ్రంగి, బుట్టల తయారీదారులు, చాప ఇంకా చీపురు తయారీదారులు, కమ్మరి, స్వర్ణకారుడు, తాపీ మేస్త్రీ, మంగలి, కుమ్మరి, చాకలి, తాళాలు, బొమ్మలు తయారు చేసేవారు, శిల్పి, రాతి చెక్కేవాడు, షూ మేకర్, బోట్ మేకర్, సుత్తి ఇంకా టూల్‌కిట్ మేకర్, ఫిషింగ్ నెట్ మేకర్ వంటి వారు ఈ పథకం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోవడానికి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్‌సైట్ pmvishwakarma.gov.inకి ఓపెన్ చేయాలి. మీ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి. OTP వెరిఫికేషన్ ద్వారా మీ మొబైల్ నంబర్ అండ్ ఆధార్ కార్డ్‌ని వెరిఫై చేయండి. ఇప్పుడు మీ పేరు, అడ్రస్ ఇంకా వ్యాపార సంబంధిత వివరాల వంటి PM విశ్వకర్మ యోజన స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ లో నింపి సబ్మిట్ చేయండి. ఇప్పుడు PM విశ్వకర్మ డిజిటల్ ID అండ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అవసరమైన డాకుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
ఆ తర్వాత, మీ వివరాలు వెరిఫై చేసిన తర్వాత లోన్ ఆమోదిస్తారు. ఈ పథకం అనేది తాలూకా లేదా జిల్లా ప్రముఖ కార్యాలయంలో ఉన్న చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమల విభాగం ద్వారా నిర్వహించే ట్రైనింగ్ ప్రోగ్రాం ఉన్న క్రెడిట్ పథకం. అభ్యర్థి స్కిల్స్ నేర్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఈ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. ఒకొక్కరికి 5 రోజుల పాటు శిక్షణతో రోజుకు రూ. 500 ఇస్తారు. అలాగే, మీ వ్యాపారానికి తగిన వస్తువులను కొనడానికి ప్రోత్సాహకంగా రూ.15,000 సబ్సిడీ అందిస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications