గత కొన్ని సంవత్సరాలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి. గత సంవత్సర కాలంలో స్టాక్స్ భారీగా ఎగిసిపడటంతో పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్ వచ్చాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వైపు చాలామంది ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. గత అయిదేళ్ల కాలంలో మంచి రాబడి ఇచ్చిన ఏడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఒకే విధమైన ఫండ్ ఎక్కువగా ఉంటే ఒకేదానిని తీసుకున్నారు. ఇవన్నీ మార్నింగ్ స్టార్ నుండి వచ్చిన ర్యాంకు ఆధారంగా ఉన్నాయి.

టాటా డిజిటల్ ఇండియా ఫండ్ - డైరెక్ట్ ప్లాన్
టాప్ రీసెర్చ్ ఫర్మ్ మార్నింగ్‌స్టార్ ప్రకారం టాటా డిజిటల్ ఇండియా ఫండ్ - డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ రిటర్న్స్ 26.81 శాతంగా ఉంది. అయిదేళ్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇది ఉత్తమమైనది. 3 ఇయర్ రిటర్న్స్ వార్షిక ప్రాతిపదికన 31.79 శాతంతో మెరుగ్గా ఉంది. ఇక్కడ మంచి రిటర్న్స్ అందించిన వాటిని మాత్రమే చర్చిస్తున్నాం.
కానీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలనే అంశానికి సంబంధించి సిఫార్సు చేయడం లేదు. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ - డైరెక్ట్ ప్లాన్స్‌లో ఎక్కువగా ఐటీ కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి.

ICICI ప్రుడెన్షియల్ టెక్నాలజీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్
ICICI ప్రుడెన్షియల్ టెక్నాలజీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ మరో టెక్నాలజీ ఫండ్. ఇది అయిదేళ్ల కాలంలో 26.80 శాతం రాబడిని ఇచ్చింది. మార్నింగ్ స్టార్ డేటా ప్రకారం అయిదేళ్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెకండ్ హయ్యెస్ట్ రిటర్న్స్ అందించింది. 3 ఇయర్ రిటర్న్స్ దాదాపు 34 శాతం వరకు ఉంది.

మరిన్ని ఫండ్స్
ఎడెల్వీస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్-షోర్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్. అయిదేళ్లుగా 25.86 శాతం రిటర్న్స్‌తో ఎడెల్వీస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్-షోర్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్ నాలుగో బెస్ట్ ఫండ్‌గా ఉంది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ గ్రోత్, డైరెక్ట్ ప్లాన్, ఎస్బీఐ టెక్నాలజీస్ ఆపర్చునిటీస్ ఫండ్-డైరెక్ట్ ప్లాన్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications