Savings account: సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఇన్ని లాభాలా? ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలివే!
ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా లేని వారు ఎవరూ లేరు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ (Savings account) ఉంటుంది. అయితే చాలామంది ఈ అకౌంట్‌ను కేవలం డబ్బులు దాచుకోవడానికి మాత్రమే వాడుతుంటారు. కానీ, ఒక సేవింగ్స్ అకౌంట్ ద్వారా మనం ఇంకా ఎన్నో పనులు చేయవచ్చు, అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఒక సాధారణ అకౌంట్ హోల్డర్ తెలుసుకోవలసిన ఆ 7 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
1. నగదు భద్రత , సులభతర లావాదేవీలు
డబ్బును ఇంట్లో పెట్టుకోవడం కంటే బ్యాంకులో దాచుకోవడం ఎప్పుడూ సురక్షితం. దొంగతనం లేదా పోగొట్టుకునే భయం ఉండదు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా, యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పుడు నిమిషాల్లో ఎవరికైనా డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.

2. బిల్లుల చెల్లింపులు , ఖర్చుల ట్రాకింగ్
కరెంట్ బిల్లు, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీఛార్జ్ వంటివన్నీ ఇంట్లో కూర్చునే మీ Savings account ద్వారా చెల్లించవచ్చు. అలాగే, మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ చూడటం ద్వారా మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఖర్చు చేశారో పూర్తి రికార్డు మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీ భవిష్యత్తు ఖర్చులను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది.
3. వడ్డీ , ఎఫ్‌డీ (FD) సౌకర్యం
మీ అకౌంట్‌లో ఉన్న డబ్బుపై బ్యాంకులు సాధారణంగా 2% నుండి 4% వరకు వడ్డీని ఇస్తాయి. డబ్బు ఖాళీగా ఇంట్లో ఉండటం కంటే, బ్యాంకులో ఉంటే కొంతైనా వడ్డీ వస్తుంది కదా! ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉండి, దాన్ని చాలా కాలం వాడము అనుకుంటే, దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)గా మార్చుకుని ఎక్కువ వడ్డీ పొందవచ్చు.
4. ట్యాక్స్ , నిబంధనలు
మీ సేవింగ్స్ అకౌంట్‌లో వచ్చే వడ్డీపై పన్ను (Tax) పడుతుందనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80TTA కింద పాత టాక్స్ విధానంలో రూ. 10,000 వరకు మినహాయింపు ఉండేది, కానీ కొత్త టాక్స్ విధానంలో ఇలాంటి మినహాయింపులు లేవు. కాబట్టి మీ ఆదాయ పరిమితిని బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ (SBI) లో ఉన్న 8 రకాల సేవింగ్స్ అకౌంట్లు
మన దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ అవసరాల కోసం ఎనిమిది రకాల ఖాతాలు ఉన్నాయి..
- సాధారణ సేవింగ్స్ అకౌంట్: ఇది అందరూ వాడే సాధారణ ఖాతా.
- బేసిక్ సేవింగ్స్ స్మాల్ అకౌంట్: పూర్తి కేవైసీ లేని వారు దీనిని ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ. 50,000 వరకు దాచుకోవచ్చు.
- సేవింగ్స్ ప్లస్ అకౌంట్: ఇది ఎంఓడీ (MOD) తో లింక్ అయి ఉంటుంది. ఖాతాలో డబ్బులు పరిమితి దాటితే ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీగా మారిపోతాయి.
- పిల్లల కోసం ఖాతాలు: 'పెహ్లా కదమ్' , 'పెహ్లీ ఉడాన్' పేరుతో మైనర్ల కోసం ప్రత్యేక ఖాతాలు ఉన్నాయి.
- వీడియో కేవైసీ అకౌంట్: బ్యాంకుకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే యోనో (YONO) యాప్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- జీరో బ్యాలెన్స్ అకౌంట్: తక్కువ ఆదాయం గల వారి కోసం ఎటువంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని ఖాతా ఇది.
- MACT క్లెయిమ్స్ అకౌంట్: రోడ్డు ప్రమాద బాధితులకు వచ్చే కోర్టు పరిహారం డబ్బులు దీనిలో జమ అవుతాయి.
- రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్: విదేశీ కరెన్సీని ఉంచుకోవాలనుకునే భారతీయుల కోసం ఇది ఉపయోగపడుతుంది.
మీ అవసరానికి తగ్గట్టుగా సరైన సేవింగ్స్ అకౌంట్ (Savings account) ను ఎంచుకోవడం ద్వారా మీరు బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగ్గా పొందవచ్చు.
have changed inside image for better relatability


Click it and Unblock the Notifications