కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు మీ పర్సనల్ ఫైనాన్స్ పైన ప్రభావం చూపే పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. మరో వారం రోజుల్లో 2022 కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ 2022 జనవరి 1వ తేదీ నుండి అందుబాటులోకి రావాల్సి ఉండగా, దీనిని ఆర్బీఐ పొడిగించింది. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ టోకెనైజేషన్ గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు పొడిగించింది. కాబట్టి ఇందులో ఎలాంటి మార్పులేదు. ఇక, ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో చోటు చేసుకోబోయే కొన్ని మార్పులు ఇక్కడ చూద్దాం..

జీఎస్టీ రూల్స్
2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్ను విధానం మరింత కఠినతరం కానుంది. కొత్త ఏడాది నుండి సీజీఎస్టీలో పలు మార్పులు అమలులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇలాంటి మార్పుల్లో పన్ను విధించదగిన సప్లై, పన్ను క్రెడిట్ అర్హత సహా కొన్ని మార్పులు ఉండవచ్చును.

నగదు ఉపసంహరణ ఖరీదు
ఏటీఎం ట్రాన్సాక్షన్స్ జనవరి 1, 2022 నుండి మరింత ఖరీదు కానున్నాయి.
అంటే ట్రాన్సాక్షన్స్‌కు మించి ఏటీఎం నుండి నగదును తీసుకుంటే ఇక నుండి ఒక్కో ట్రాన్సాక్షన్ పైన రూ.21 ఛార్జీ వర్తిస్తుంది. అకౌంట్ ఉన్న బ్యాంకులో నాన్ క్యాష్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ పరిమితి 5, నాన్-బ్యాంక్ అయితే మూడు.

పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు
బాండ్ యీల్డ్స్ ఆధారంగా పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఓసారి సవరిస్తారు. సవరించిన వడ్డీ రేట్లు పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్‌లు, సుకన్య సమృద్ధి యోజన, వంటి వాటికి వర్తిస్తుంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఛార్జీ: ప్రత్యేక పరిమితి అనంతరం క్యాష్ డిపాజిట్స్ దాటితే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఛార్జీ విధిస్తుంది.

సిలిండర్ ధరలు
ఈ నెలలో ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి నెల మొదటి తారీఖున ధరలను సవరిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల ప్రారంభంలో ధరల్లో మార్పు ఉండవచ్చు. ఈ నెలలో కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. కానీ 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మార్పులేదు.

ఈపీఎఫ్ నామిని
డిసెంబర్ 31, 2021 లోపు ఈపీఎప్ నామినేషన్ పూర్తి చేయాలి. అప్పుడు ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ అనుకోని విధంగా మృత్యువాత పడితే నామినీకి చాలా సులభంగా ఈపీఎఫ్ మొత్తం వస్తుంది. నామినీ చాలా సులభంగా ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు.
More From GoodReturns

HDFC బ్యాంక్ బంపర్ ఆఫర్.. లోన్ ఉన్నవారికి ఊరట.. నేటి నుండే కొత్త రేట్లు అమలు!

రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గే అవకాశం!

రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గదా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications