పదింట తొమ్మిదిమంది భారతీయులు పదవీ విరమణ తర్వాత ఎలా అని ఆలోచిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా గడిపేందుకు సన్నద్ధంగా ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారని మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ సర్వేలో వెల్లడైంది. తమ సంపాదన ఆగిపోయిన తర్వాత పదేళ్లకు తమ వద్ద ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుందని, ఆ తర్వాత ఎలా అనే దిగులు చాలామంది భారతీయుల్లో ఉంది. కార్వీ ఇన్‌సైట్స్‌తో కలిసి నిర్వహించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం నగర భారతం ఈ సూచీలో 44 దగ్గర ఉంది. ఆరోగ్యం, ఆర్థికం, భావోద్వేగాలను పరిగణలోకి తీసుకొని దీనిని రూపొందించింది. 28 నగరాల్లోని 1800 మందికి పైగా ఈ డిజిటల్ సర్వేలో పాల్గొన్నారు.

రిటైర్మెంట్‌కు నో
తమ సంపాదన ఆగిపోయిన తర్వాత 5 ఏళ్లలో తమ డబ్బంతా ఖర్చు అయిపోతుందని 26 శాతం మంది, 5 నుండి పదేళ్లలో తమ డబ్బు ఖర్చు అయిపోతుందని 30 శాతం మంది, 10 ఏళ్లు, ఆ పైన ఖర్చు అయిపోతుందని 27 శాతం మంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి తమ చేతుల్లోని డబ్బు కొన్నేళ్లలో ఖర్చయిపోతుందని ఎక్కువమంది ఆందోళనగా ఉన్నారు. రిటైర్మెంట్ ఇండెక్స్‌లో భారత్ 44వ స్థానంలో ఉంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పదవీ విరమణకు ఆసక్తి చూపించడం లేదు. 56 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య 19 శాతం మంది, 61 నుండి 65 ఏళ్ల మధ్య12 శాతం మంది రిటైల్ అయ్యేందుకు మొగ్గు చూపారు.

పెట్టుబడులపై ఆసక్తి
47 శాతం మంది ఆర్థిక స్వేచ్ఛ కోసం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. 70 శాతం మందికి పదవీ విరమణ తర్వాత అవసరాల గురించి అవగాహన ఉంది. సాధ్యమైనంత త్వరగా పదవీ విరమణ ప్రణాళిక ప్రారంభించాలని 80 శాతం మంది భావిస్తున్నారు. 41 శాతం మంది ఇతర బాధ్యతలతో పాటు పదవీ విరమణ కోసం పెట్టుబడులు ప్రారంభించాలని చూస్తున్నారు. నలుగురిలో ఒకరు 65 ఏళ్ల వయస్సుకు వచ్చాక రిటైర్ కావాలని యోచిస్తున్నారు.

జీవిత బీమా స్కీం
రిటైర్ అయ్యాక పిల్లల మీద ఆధారపడతామని 45 శాతం మంది, తమ వద్ద కావాల్సినంత మొత్తం ఉందని 36 శాతం మంది చెప్పారు. పదవీ విరమణ కోసం పొదుపు అనేది ముఖ్య ఆర్థిక అంశంగా 24 శాతం మంది చెప్పారు. 56 శాతం మంది తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తం, రిటైర్ అయ్యాక పదేళ్లలో ఖర్చు అయిపోతుందని భావిస్తున్నారు. 67 శాతం మంది అర్బన్‌కు చెందిన వారు పదవీ విరమణ కోసం జీవిత బీమా మంచి స్కీం అని చెబుతుండగా, 40 శాతం మంది వీటిని ఎంచుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications