అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్స్ నిర్ణయం వల్ల పెట్టుబడిదారులు కన్ఫ్యూషన్ లో ఉన్నారు. భారతీయ ఉత్పత్తులపై ఇప్పటికే ఉన్న 25% టారిఫ్‌కి అదనంగా మరో 25% సుంకం వేశారు. అమెరికాకు ఎగుమతి అయ్యే అనేక వస్తువులు ఇప్పుడు "50% టారిఫ్" భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇది వినగానే చాలా మంది ఇన్వెస్టర్లకు మొదటి ప్రశ్న "మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్‌కి దీని ప్రభావం ఉంటుందా?"

మార్కెట్ నిపుణుల మాటలో చెప్పాలంటే, SIPలు ఇప్పటికీ బెస్ట్ స్ట్రాటజీ అని అంటున్నారు. ముంబైలోని ప్లాన్ ఎహెడ్ వెల్త్ అడ్వైజర్స్ CEO విశాల్ ధవాన్ మాటల్లో, "ఫండ్ మేనేజర్లు ఇప్పటికే తమ లెవల్‌లో అజస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లు పానిక్ అవ్వాల్సిన పనిలేదు. SIPలు కొనసాగిస్తే సరిపోతుంది" అని స్పష్టం చేశారు. అంటే లాంగ్ టర్మ్ కి SIPలు ఎల్లప్పుడూ వర్క్ అవుతాయి. మార్కెట్ ఎంత వోలటైల్ అయినా, రుపీ కాస్ట్ అవరేజింగ్ వల్ల మనకు లాభం దక్కుతుంది.
ఎవరికీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు:
ఈ టారిఫ్‌లు విన్న వెంటనే కొందరికి షాకింగ్ అనిపించొచ్చు కానీ అసలైన ప్రభావం మాత్రం మొత్తం మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లో కేవలం 2-3% వరకే పరిమితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అది కూడా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడే రంగాలకు మాత్రమే. అందువల్ల ప్రతి ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియో మార్చుకోవాలా? అంటే, లేదన్న సమాధానమే వస్తుంది.
ఈ సందర్భంలో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌కి డిమాండ్ పెరుగుతుందా అనే ప్రశ్న వస్తోంది. విశాల్ ధవాన్ అభిప్రాయం ప్రకారం ఇవి కరెన్సీ రిస్క్ తగ్గిస్తాయి, ఒకే మార్కెట్‌పై ఆధారపడకుండా డైవర్సిఫికేషన్ ఇస్తాయి. కానీ హృశికేశ్ పాల్వే మాత్రం హెచ్చరిస్తూ, "ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5-10% మాత్రమే పెట్టండి" అని చెప్పారు.
విశాల్ ధవాన్ అంచనా ప్రకారం, సుమారు 45-50 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెరికా కొత్త టారిఫ్‌ల బరువు మోసే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, జ్యువెలరీ, సీ ఫుడ్, కార్పెట్లు, ఫర్నిచర్ రంగాలే ఎక్కువగా దెబ్బతింటాయని భావిస్తున్నారు. అదే సమయంలో, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా లాంటి పొరుగు దేశాలు మాత్రం ఈ పరిణామాల వల్ల లాభపడవచ్చు, ఎందుకంటే వాటి ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉన్నాయి. అయితే అంతా నష్టమేనని కాదు కాని కొన్ని రంగాలు ఈ భారాల నుండి పూర్తిగా మినహాయింపులు పొందాయి. వాటిలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ వంటి కీలక రంగాలు ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడూ 5-7 ఏళ్ల హరైజన్ తో చేయాలి. ఒక అధ్యయనం ప్రకారం, ఎవరైనా నిఫ్టీ 50లో SIP ప్రారంభించి, ఒక సంవత్సరం తర్వాత నెగెటివ్ రిటర్న్స్ చూశా, తరువాత ఐదేళ్లు కొనసాగిస్తే 11-12% వరకు పాజిటివ్ రిటర్న్స్ వచ్చాయి. అందువల్ల, మార్కెట్ డిప్స్ సమయంలో పానిక్ అవ్వకుండా SIPలు కొనసాగించడం దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పోర్ట్‌ఫోలియో బ్యాలెన్సింగ్ ఎలా ఉంచాలి
ఆనంద్ రాఠీ వెల్త్ డైరెక్టర్ హృశికేశ్ పాల్వే ఇన్వెస్టర్ల కోసం మూడు కీలక సూచనలు చేశారు. ముందుగా, పోర్ట్‌ఫోలియోని సమయానికి రివ్యూ చేసి రీబ్యాలెన్స్ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. లార్జ్ క్యాప్‌లో 50-55%, మిడ్‌క్యాప్‌లో 20-25% పెట్టి, మిగిలిన మొత్తాన్ని స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్‌ను మేనేజ్ చేయవచ్చని చెప్పారు. అలాగే, డైవర్సిఫికేషన్ తప్పనిసరి అని, ఒకే రంగం మీద ఆధారపడకుండా విభిన్న ఈక్విటీ కేటగిరీస్‌లో డబ్బు పెట్టడం సేఫ్ అని సూచించారు. చివరిగా, SIPలను నిరంతరం కొనసాగించడం చాలా ముఖ్యం అని, లంప్-సమ్ పెట్టాలనుకునేవారు కూడా ఒకేసారి కాకుండా 4-5 విడతలుగా ఇన్వెస్ట్ చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
More From GoodReturns

SIP investment: రీల్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బులు గల్లంతే!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

EMI ట్రాప్‌లో పడకుండా ఐఫోన్ కొనడం ఎలా? నిపుణుల బెస్ట్ టిప్స్!

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్‌లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్‌లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..



Click it and Unblock the Notifications