ఈ 5 నిఫ్టీ డివిడెండ్ స్టాక్స్ ఏకంగా 150% రిటర్న్స్ ఇచ్చాయి
భారత స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. సెన్సెక్స్ 52,586 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15,763 పాయింట్ల వద్ద ముగిసింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సూచీలు దారుణంగా పతనమయ్యాయి. సూచీలు ప్రస్తుతం ఉన్నవాటిలో అప్పుడు సగానికి పడిపోయాయి. ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో సూచీలు పైకెగిశాయి. ఆ తర్వాత సెకండ్ వేవ్ సమయంలోను సూచీలు కాస్త కిందకు పడినప్పటికీ వెంటనే పుంజుకున్నాయి. ప్రస్తుతం సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. కంపెనీలు తమ స్టాక్ హోల్డర్లకు డివిడెండ్స్ ఇస్తుంటాయి. గత పన్నెండు నెలలకు గాను లెక్కించి డివిడెండ్ చెల్లిస్తాయి. జనవరిలో ముగిసే ఒక సంవత్సర కాలానికి సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా లెక్కిస్తారు.
డివిడెండ్ దిగుబడి ఆధారంగా టాప్ 25లో లిస్ట్ చేయబడిన వాటిని ఇండెక్స్‌లో చేర్చగా, 75 కంటే తక్కువ ర్యాంక్ చేయబడిన కంపెనీలను తొలగించాలి. చివరి 50 కంపెనీలు వాటి డివిడెండ్ యీల్డ్స్ ఆధారంగా ఎంపిక చేయబడతాయి.

డివిడెండ్‌ను ఇలా లెక్కిస్తారు...
డివిడెండ్ యీల్డ్ = క్యాష్ డివిడెండ్ పర్ షేర్/మార్కెట్ ప్రైస్ పర్ షేర్X100 డివిడెండ్ యీల్డ్స్ కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఉదాహరణకు స్టాక్ డివిడెండ్ యీల్డ్ 10/100X100 = 10%.
150% శాతం 5 నిఫ్టీ డివిడెండ్ స్టాక్స్
గత ఏడాది 150 శాతం రిటర్న్స్ అందించిన స్టాక్స్‌లో...
- టాటా స్టీల్ లిమిటెడ్ 2021 ఏడాదిలో 66.19 శాతం రిటర్న్స్, ఒక సంవత్సరంలో 291.24 శాతం రిటర్న్స్ అందించింది.
- సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ 2021 ఏడాదిలో 103.07 శాతం రిటర్న్స్, ఒక సంవత్సరంలో 282.77 శాతం రిటర్న్స్ అందించింది.
- సైయెంట్ 2021 ఏడాదిలో 48.23 శాతం రిటర్న్స్, ఒక సంవత్సరంలో 203.41 శాతం రిటర్న్స్ అందించింది.
- ఎన్ఏటీఎల్.అల్యుమినియం 2021 ఏడాదిలో 59.15 శాతం రిటర్న్స్, ఒక సంవత్సరంలో 164.37 శాతం రిటర్న్స్ అందించింది.
టాటా స్టీల్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఇది టాటా గ్రూప్‌కు చెందిన కంపెనీ. దీని షేర్ ధర ప్రస్తుతం రూ.1433 వద్ద ఉంది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.172640.62 కోట్లుగా ఉంది. కంపెనీ గ్రాస్ సేల్స్ రూ.648690 కోట్లు, మొత్తం ఆదాయం రూ.655068.9 కోట్లుగా నమోదయింది. టాటా స్టీల్ గత 12 నెలల కాలంలో టాటా స్టీల్ ఈక్విటీ డివిడెండ్‌ను రూ.37.50 ఇచ్చింది. ఇది ప్రస్తుత షేర్ రూ.1434 వద్ద 2.61 శాతానికి సమానం. ఒక ఏడాదిలో ఈ స్టాక్ 285 శాతం, ఆరు నెలల కాలంలో 126 శాతం, నెల కాలంలో 23.35 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.172640.62గా ఉంది.
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ 1997లో ప్రారంభమైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,913.65 కోట్లుగా ఉంది. మూడేళ్ల కాలంలో ఈ స్టాక్ 40 శాతం లాభపడింది. అదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మాత్రం 47.35 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత మూడేళ్ల కాలంలో ఇది మూడుసార్లు డివిడెండ్ ఇచ్చింది. గత పన్నెండు నెలలకాలంలో రూ.4.50 ఈక్విటీ డివిడెండ్ ఇచ్చింది.
సైయెంట్ లిమిటెండ్ 2000లో ప్రారంభమైంది. గత మూడేళ్ల కాలంలో ఈ స్టాక్ 41శాతం కంటే పైన ఎగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,863.67 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.987 వద్ద ఉంది. గత పన్నెండు నెలల కాలంలో రూ.12 డివిడెండ్ ఇచ్చింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ గత మూడేళ్ల కాలంలో 50.68 శాతం రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 47.35 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2000 ఆగస్ట్ 22 నుండి 38 డివిడెండ్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications