రూ. 5 లక్షలు ఒకే FD లో వేస్తున్నారా? లేక 5 ముక్కలు చేస్తున్నారా? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే లాభాలే లాభాలు!
ఈ రోజుల్లో మార్కెట్లో ఎన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు వచ్చినా.. సామాన్యులు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా నమ్మేది ఫిక్స్‌డ్ డిపాజిట్లను (FDs) మాత్రమే. ఇందులో ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. అయితే, మీ దగ్గర రూ. 5 లక్షల పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు.. దానిని ఒకే ఎఫ్‌డీలో పెట్టాలా? లేక రూ. 1 లక్ష చొప్పున ఐదు వేర్వేరు ఎఫ్‌డీలుగా విభజించాలా? అనే డౌట్ చాలా మందికి వస్తుంది.
రాబడి పరంగా రెండింటిలోనూ పెద్దగా మార్పు ఉండదు. కానీ, 10 ఏళ్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ విషయానికి వస్తే.. మీ డబ్బుకు లిక్విడిటీ (అవసరానికి వాడుకునే సదుపాయం), ఫ్లెక్సిబిలిటీ ఏ ఆప్షన్‌లో ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు సింపుల్‌గా లెక్కలతో సహా చూద్దాం.

రూ. 5 లక్షలు ఒకే FD లో పెడితే వచ్చే రిటర్న్స్..
మనం ప్రస్తుత సగటు వడ్డీ రేట్లు (FD interest rates) 7 శాతంగా (కంపౌండింగ్ క్వార్టర్లీ) అనుకుందాం.
- పెట్టుబడి: రూ. 5,00,000
- 10 ఏళ్ల తర్వాత వచ్చే వడ్డీ (రిటర్న్స్): దాదాపు రూ. 5,00,799
- మొత్తం మెచ్యూరిటీ అమౌంట్: సుమారు రూ. 10,00,799
అంటే.. 7% వడ్డీ రేటు వద్ద 10 సంవత్సరాలలో మీ పెట్టుబడి దాదాపు డబుల్ (రెట్టింపు) అవుతుంది.
రూ. 1 లక్ష చొప్పున 5 FDs చేస్తే వచ్చే రిటర్న్స్..
ఇప్పుడు అదే రూ. 5 లక్షలను విడదీసి.. 7% వడ్డీతో ఐదు వేర్వేరు అకౌంట్లలో పెడితే..
- ఒక్కో FD మెచ్యూరిటీ అమౌంట్: రూ. 2,00,160
- మొత్తం 5 FDs కలిపి వచ్చే అమౌంట్: సుమారు రూ. 10,00,800
ఇక్కడ గమనించారా? మీరు ఒకేసారి పెట్టినా, విడదీసి పెట్టినా వచ్చే లాభం పైసా తేడా లేకుండా ఒకేలా ఉంటుంది. కానీ, ఫైనాన్షియల్ ప్లానర్లు మాత్రం ఐదు ఎఫ్‌డీలు చేయడమే స్మార్ట్ స్ట్రాటజీ అనిచెబుతారు. ఎందుకంటే..
ఐదు వేర్వేరు FDs చేయడం వల్ల లాభాలు..
- ఎమర్జెన్సీలో గట్టి సపోర్ట్: ఉదాహరణకు మీకు సడన్‌గా రూ. 50,000 అవసరమయ్యాయి అనుకుందాం. మీరు రూ. 5 లక్షలు ఒకే ఎఫ్‌డీలో పెడితే, ఆ మొత్తం ఎఫ్‌డీని క్యాన్సిల్ (Premature withdrawal) చేయాల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు మీకు పెనాల్టీ వేస్తాయి, వడ్డీ నష్టపోతారు. అదే ఐదు ఎఫ్‌డీలు ఉంటే.. కేవలం ఒకే ఒక్క రూ. 1 లక్ష ఎఫ్‌డీని బ్రేక్ చేసి మీ అవసరం తీర్చుకోవచ్చు. మిగిలిన 4 లక్షల ఎఫ్‌డీలు సేఫ్‌గా రన్ అవుతూనే ఉంటాయి.
- ఎఫ్‌డీ లాడరింగ్ (FD Laddering): విడివిడిగా చేయడం వల్ల మీరు వేర్వేరు మెచ్యూరిటీ డేట్స్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో వడ్డీ రేట్లు (FD interest rates) పెరిగినప్పుడు ఆ లాభాన్ని సులభంగా అందుకోవచ్చు.
- బ్యాంక్ ఇన్సూరెన్స్ సేఫ్టీ: డీఐసీజీసీ (DICGC) రూల్స్ ప్రకారం.. ఒక బ్యాంకులో ఒక కస్టమర్ డిపాజిట్‌కు రూ. 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ (భద్రత) ఉంటుంది. మీరు ఈ ఐదు లక్షలను వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వల్ల మీ డబ్బుకు 100% సేఫ్టీ పెరుగుతుంది.
ఒకే FD ఎప్పుడు బెటర్?
మీకు ఎక్కువ పేపర్‌వర్క్ వద్దు, ఐదు మెచ్యూరిటీ డేట్లను ట్రాక్ చేయడం తలనొప్పి అనుకుంటే.. ఒకే ఎఫ్‌డీ బెటర్. అకౌంట్ మేనేజ్‌మెంట్ చాలా సింపుల్‌గా ఉంటుంది.
చివరిగా నిపుణుల సూచన ఏంటంటే.. ఎక్కువ మేనేజ్‌మెంట్ శ్రమ లేకుండా ఉండాలంటే ఒకే ఎఫ్‌డీ చేయండి. కానీ అత్యవసర సమయాల్లో డబ్బులు వాడుకోవాలన్నా, పెనాల్టీల భయం లేకుండా ఉండాలన్నా మాత్రం డబ్బును స్ప్లిట్ చేసి మల్టిపుల్ ఎఫ్‌డీలు చేయడమే అన్ని విధాలా సేఫ్ అండ్ స్మార్ట్ ఛాయిస్!


Click it and Unblock the Notifications