For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC MF నుండి 5 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, అప్పటి నుండి ఎంత లాభం వచ్చిందంటే?

|

లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, రిటైర్మెంట్, ట్యాక్స్ సేవింగ్స్ తదితర ఆర్థిక లక్ష్యాల కోసం HDFC ప్లాన్స్ ఉన్నాయి. ఈ బ్యాంకు ఉత్పత్తుల్లో ఎక్కువగా ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ 3 లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చింది. మంచి రిటర్న్స్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా అనేక కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చినప్పుడు ఈక్విటీ ఫండ్స్ ఎక్కువగా అధిక రిస్క్‌ను కలిగి ఉంటాయి. అనేక రకాల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అయితే మీరు రిస్క్ ప్రొఫైల్‌ను పరిగణలోకి తీసుకొని పెట్టుబడి పెట్టాలి.

HDFC ఫండ్స్...

HDFC ఫండ్స్...

సరళ, సులభ పెట్టుబడి ఉత్పత్తి, అనువైన ట్రాన్సాక్షన్స్, అత్యంత స్థిరమైన నిర్వహణ, విభిన్న పంపిణీ నెట్ వర్క్ మద్దతుతో ఈ ఫండ్ హౌస్ భారత అతిపెద్ద, అత్యంత విజయవంతమైన మ్యూచువల్ ఫండ్ మేనేజ్‌మెంట్‌లో ఒకటిగా నిలిచింది. ఇందులో HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్, HDFC స్మాల్ క్యాప్ ఫండ్, HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, HDFC ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్ HDFC ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఉన్నాయి.

HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్

HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్

HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్... HDFC మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇది 2021 జూలై 10 నాటికి రూ.1,591.61 కోట్ల AUM, కరెంట్ NAV 28.655గా ఉంది. ఈ పథకానికి కనీస సిప్ రూ.500. ఈ ఫండ్ ఎక్కువగా ఫైనాన్షియల్, టెక్నాలజీ, కెమికల్, ఇంజినీరింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఇన్వెస్ట్ చేసింది.

ఈ ఫండ్ టాప్ 5 హోల్డింగ్స్‌లో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, HDFC ఉన్నాయి. వ్యాల్యూ రీసెర్చ్ ఈ ఫండ్‌కు 4 శాతం రేటింగ్ ఇచ్చింది. ఈ ఫండ్ ఏడాదిలో 68.99 శాతం, మూడేళ్లలో 18.41 శాతం, అయిదేళ్లలో 18.27 శాతం రిటర్న్స్ ఇవ్వగా, ప్రారంభించినప్పటి నుండి 21.65 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

HDFC స్మాల్ క్యాప్ ఫండ్

HDFC స్మాల్ క్యాప్ ఫండ్

HDFC స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్... HDFC మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్. ఇది మీడియం సైజ్ ఫండ్. అయిదేళ్ల క్రితం ప్రతి నెల రూ.10,000 మొత్తంతో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుతం ఈ మొత్తం రూ.10.75 లక్షలుగా అవుతుంది. ఏడాదిలో 104.35%, మూడేళ్లలో 16.33%, అయిదేళ్లలో 19.87% రిటర్న్స్ ఇవ్వగా, ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున 19.65 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్

HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్

HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్... HDFC మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్. ఈ ఫండ్ ఏడాదిలో 72.12%, మూడేళ్లలో 13.94%, అయిదేళ్లలో 15.29% రిటర్న్స్ ఇవ్వగా, ప్రారంభమైనప్పటి నుండి 16.34 శాతం రిటర్న్స్ ఇచ్చింది. టాప్ ఫైవ్ హోల్డింగ్స్‌లో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఫైనాన్స్, బాల్‌క్రిష్ణ ఇండస్ట్రీస్, ఆర్తి ఇండస్ట్రీస్, సుందరమ్ ఫాస్టనర్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి.

HDFC ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్

HDFC ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్

HDFC ఇండెక్స్ సెన్సెక్స్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్... HDC మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇది మీడియం సైజ్ ఫండ్. ఇది ఏడాదిలో 44.24 శాతం, మూడేళ్లలో 13.97 శాతం, అయిదేళ్లలో 14.63 శాతం రిటర్న్స్ ఇవ్వగా, ప్రారంభమైనప్పటి నుండి 13.39 శాతం రిటర్న్స్ ఇచ్చింది. టాప్ 5 హోల్డింగ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HDFC, ICICI బ్యాంకు ఉన్నాయి.

HDFC ఈక్విటీ సేవింగ్స్ ఫండ్

HDFC ఈక్విటీ సేవింగ్స్ ఫండ్

HDFC ఈక్విటీ సేవింగ్స్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఫండ్ ఏడాదిలో 27.35 శాతం, మూడేళ్లలో 9.55 శాతం, అయిదేళ్లలో 10.14 శాతం రిటర్న్స్ ఇవ్వగా, ప్రారంభమైనప్పటి నుండి 9.48 శాతం రిటర్న్స్ ఇచ్చింది. టాప్ ఫైవ్ హోల్డింగ్స్‌లో ఆర్బీఐ, ఇన్ఫోసిస్, రిలయన్స్, ICICI, HDFC ఉన్నాయి.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. నష్టాలను భరించే శక్తి ఉంటేనే ఆ మేరకు పెట్టుబడులు పెట్టాలి. ఈ వ్యాసం ఆధారంగా పెట్టుబడులు పెడితే కంపెనీ లేదా రచయిత బాధ్యత వహించరు. నిపుణుల సూచనలను తీసుకోవాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది.

English summary

HDFC MF నుండి 5 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, అప్పటి నుండి ఎంత లాభం వచ్చిందంటే? | 5 Equity Mutual Funds To Start SIP In 2021 From HDFC Mutual Fund

HDFC has a plan for any financial goal - long-term, short-term, retirement, tax-saving, and so on. The majority of their mutual fund products have CRISIL ratings of 3 or higher.
Story first published: Monday, July 12, 2021, 14:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X