ముంబై: భారత్‌లోని 5 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లు దాటి 2020 ఏడాది ముగుస్తోంది! కేవలం డిసెంబర్ త్రైమాసికంలోనే ఇప్పటి వరకు ఫారెన్ ఇన్వెస్టర్స్ 18.5 బిలియన్ డాలర్ల రికార్డ్ మొత్తాన్ని భారత ఈక్విటీ మార్కెట్లోకి జొప్పించారు. 2020 ముగిసే సమయానికి 5 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లు దాటి ముగుస్తుండగా, అందులో ఈ ఏడాది మాత్రమే ఈ మార్కు అందుకున్న సంస్థలు రెండు. ఒకటి హిందూస్తాన్ యూనీ లీవర్(HUL), ఇన్ఫోసిస్. తద్వారా ఈ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ, HDFC బ్యాంకు లిమిటెడ్ జాబితాలో చేరాయి.

రిలయన్స్ ఎం-క్యాప్ అప్ అండ్ డౌన్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ.12.64 లక్షల కోట్లు దాటింది. ఈ ఏడాది ఓ సమయంలో రూ.16 లక్షల మార్కు చేరుకున్న రిలయన్స్, ఆ తర్వాత పడిపోయింది. రూ.2,300ను క్రాస్ చేరి జీవనకాల గరిష్టాన్ని తాకింది. అయితే ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సంబంధించి అమెజాన్‌తో న్యాయచిక్కుల నేపథ్యంలో ఇటీవల స్టాక్ 1950 దిగువకు కూడా పడిపోయింది. గతవారం కూడా రూ.1994 వద్దే ముగిసిన స్టాక్, చాలా రోజుల తర్వాత నేడు రూ.2002 వద్ద క్లోజ్ అయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్లు దిగువన ఉంది. అయినప్పటికీ దేశీయ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ ముందు ఉన్నది.

టాప్ 5 కంపెనీల మార్కెట్ క్యాప్
రిలయన్స్ తర్వాత టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10.91 లక్షల కోట్లు. ఇటీవలే ఈ దేశీయ ఐటీ దిగ్గజం రూ.10 లక్షల కోట్ల మార్కును క్రాస్ చేసింది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.7.69 లక్షల కోట్లు, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.5.63 లక్షల కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.5.26 లక్షల కోట్లు.

20 శాతం క్షీణించి.. జంప్
భారత స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో 20 శాతం మేర క్షీణించాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆ తర్వాత అంతకంతకూ పడిపోయింది. మార్చి 23న 26వేల దిగువకు పతనమైంది. అన్-లాక్ తర్వాత క్రమంగా కోలుకుంటున్న మార్కెట్లు, రెండు నెలలుగా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి.
ఇక, 2021లో కొన్ని కంపెనీలు రూ.5 లక్షల కోట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇందులో HDFC(ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.4.44 లక్షల కోట్లు), కొటక్ మహీంద్ర (మార్కెట్ క్యాప్ రూ.3.88 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (3.54 లక్షల కోట్లు) ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications