For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తక్కువ మొత్తాలతో అధిక రాబడిని అందించే టాప్-5 మ్యూచువల్ ఫండ్స్ ఇవే..!

|

దీర్ఘకాల ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్ అత్యుత్తమమైనవిగా చెప్పుకోవచ్చు. మంచి లాభాలను అందిస్తుంటాయి ఇవి. మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడిని ఇస్తుండటం వల్ల ఇటీవలి కాలంలో మదుపర్లు వీటిపై మొగ్గు చూపుతున్నారు. ఆశించిన పెట్టుబడి లక్ష్యాన్ని సాధించడానికి లేదా మంచి రాబడిని సంపాదించడానికి.. సరైన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను పెట్టడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టేటప్పుడు వాటి స్థితిగతుల గురించి తెలుసుకోవడం అత్యవసరం.

పదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు ఆదాయాన్ని ఇచ్చిన సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్‌ను మార్కెట్ వర్గాలు ఎంపిక చేశాయి. ఇందులో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాంప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్, మియిరె అసెట్ డీమెర్జింగ్ బ్లూచిప్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్ని కూడా ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్‌లో మంచి ఆదాయాన్ని అందించినవే.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్

వ్యాల్యూ రీసెర్చ్ అంచనాల ప్రకారం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ గత పది సంవత్సరాల కాలంలో ఎస్ఐపీ ద్వారా 27.8 శాతం మేర రిటర్నులను అందించింది. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్ అత్యధిక ఆదాయాన్ని ఇన్వెస్టర్లకు అందజేసింది. నెలకు 10 రూపాయలను గనక పెట్టుబడిగా పెట్టగలిగితే 51.5 లక్షల రూపాయల మేర పెట్టుబడిని అందించే మ్యూచువల్ ఫండ్ ఇది. ఈ పథకంలో ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడి అధికభాగం సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీల్లోకి వెళ్తుంది. దీని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ 5,037 కోట్ల రూపాయలు.

ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్

ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్

వ్యాల్యూ రీసెర్చ్ చేసిన జాబితాలో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ రెండో స్థానంలో ఉంది. 10 సంవత్సరాల వ్యవధిలో ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు 26.6 శాతం సగటున రిటర్నులను అందించింది. 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా 10,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టగలిగితే దాని ఎస్ఐపీ 48.3 లక్షల రూపాయలకు చేరుతుంది. దీని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ విలువ 9,714 కోట్ల రూపాయలు. కొంతకాలంగా ఎస్ఐపీ సెగ్మెంట్‌లో ఎస్బీఐ స్మాల్ క్యాంప్ ఫండ్ కొంత బలహీనంగా కనిపిస్తోంది.

 నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా 10 సంవత్సరాల వ్యవధిలో ఇన్వెస్టర్లకు సగటున 26.5 శాతం మేర లాభాలను అందించింది. వ్యాల్యూ రీసెర్చ్ గణాంకాల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది. ప్రతినెలా 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన వారికి లాంగ్ టర్మ్‌లో 48.1 లక్షల రూపాయల రిటర్నులను అందించింది ఈ ఫండ్. దీని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ 16,633 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ సెగ్మెంట్‌లో ఎప్పటికప్పుడు తన పనితీరును మెరుగుపరచుకుంటోంది. టాప్ 3 స్కీమ్స్‌లల్లో ఒకటిగా కొనసాగుతోంది.

 ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్

ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి బెస్ట్ ఆప్షన్‌గా చెబుతుంటారు ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్‌ను. 10 వేల రూపాయల పెట్టుబడికి 26.4 శాతం అధిక రాబడిని అందించింది. దీని విలువ 48.03 లక్షల రూపాయలు. ఇందులో ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా సాఫ్ట్‌వేర్, పారిశ్రామిక రంగాలకు చేరుతుంది. టెలికం, ఇంజినీరింగ్ సెక్టార్లలోనూ దీనికి సంబంధించిన ఇన్వెస్టిమెంట్స్ ఉన్నాయి. దీని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ వ్యాల్యూను 2,288 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు.

మియర్ అసెట్ డీమెర్జింగ్ బ్లూచిప్ ఫండ్

మియర్ అసెట్ డీమెర్జింగ్ బ్లూచిప్ ఫండ్

లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన ఫండ్.. మియర్ అసెట్ డీమెర్జింగ్ బ్లూచిప్. ఇందులో ప్రతినెలా 10 వేల రూపాయల మేర పెట్టుబడి పెడితే 45.2 లక్షల రూపాయల రిటర్నులను అందిస్తుంది. దీని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ వ్యాల్యూ 20.615 కోట్ల రూపాయలు. మ్యూచువల్ ఫండ్స్‌లల్లో పెట్టుబడి అనేది మార్కెట్‌లో నెలకొనే ఆటుపోట్లపై ఆధారపడి ఉంటుంది. ఆయా ఫండ్స్‌లల్లో పెట్టుబడులను పెట్టడానికి ముందు మార్కెట్ నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది.

English summary

తక్కువ మొత్తాలతో అధిక రాబడిని అందించే టాప్-5 మ్యూచువల్ ఫండ్స్ ఇవే..! | 5 Best Mutual Funds would have been upto Rs 51 lakh with daily Rs 333 investment

5 Best Mutual Funds Rs 333 daily would have been upto Rs 51 lakh know names of schemes Next on the list is SBI Small cap Fund. It has given an annual return of 26.6 per cent in the last 10 years.
Story first published: Saturday, October 9, 2021, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X