వివిధ అవసరాలరీత్యా చాలామంది సమీప భవిష్యత్తులో అవసరం కోసం తమ వద్ద డబ్బులు ఉంచుకుంటారు. ఆ డబ్బుల అవసరం సమయం వచ్చే వరకు తమ దగ్గరే ఉంచుకోవాలా.. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా అనే సందిగ్ధత చాలామందిలో ఉంటుంది. అయితే మీ చేతిలో అలా డబ్బు ఉంటే కనుక ఎక్కువ రాబడిని ఇచ్చే సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉదాహరణకు మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ఓ స్థలం అమ్మారు. ఆ డబ్బు మీ చేతిలో ఉంటుంది. కొత్త ఇల్లు దొరికి, ట్రాన్సాక్షన్స్ జరిగే వరకు ఆ డబ్బు మీ వద్ద ఉంటుంది. అలాంటి మొత్తాన్ని మంచి రాబడి ఇచ్చి షార్ట్ టర్మ్ పెట్టుబడిగా పెడితే మంచిది. అలాంటి నాలుగు పెట్టుబడుల గురించి తెలుసుకుందాం...

IDFC First Bank సేవింగ్ అకౌంట్
IDFC First Bank సేవింగ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్స్ వలె అనువైనది. ఇంకా చెప్పాలంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ ఇస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మరో ప్రయోజనం కూడా ఉంది. ఇది రూ.10,000 వరకు పన్నురహిత రాబడిని ఇస్తుంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్‌కు ఈ సౌకర్యం లేదు.
ఈ బ్యాంకు మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. ఉచిత ప్రమాద బీమాను అందిస్తోంది. మృతి చెందినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.25 లక్షల వరకు ఇన్సురెన్స్ కవర్ ఉంది. మేజర్ సిటీల్లోని విమానాశ్రయాల్లో ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ఏ బ్యాంకు నుంచి అయినా లేదా ఏ నెట్ వర్క్ నుంచి అయినా ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ సదుపాయం ఉంది.

Yes Bank సేవింగ్ అకౌంట్
యస్ బ్యాంకు కూడా షార్ట్ టర్మ్ డిపాజిట్ పైన మంచి వడ్డీ రేటును అందిస్తోంది. స్వల్పకాలిక పెట్టుబడి కోసం ఇది మీకు మంచి ఎంపిక అవుతుంది. డిపాజిట్ మాదిరిగా కాకుండా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు డబ్బులు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. యస్ బ్యాంకులో వడ్డీ రేటు 6 శాతం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్‌కు వచ్చిన వడ్డీ వస్తుంది. షార్ట్ టర్మ్ కోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

Bajaj Finance డిపాజిట్స్
స్వల్పకాలానికి గాను చేతిలో డబ్బులు ఉంటే ఏడాది టెన్యూర్‌కు బజాజ్ ఫైనాన్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. 12 నెలల డిపాజిట్ పైన 8 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఏడాది లోపే కనుక మీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఏడాదికి ముందే వెనక్కి తీసుకుంటే మీకు వచ్చే రిటర్న్స్ తగ్గిపోతాయి. కచ్చితంగా ఏడాది కాలానికి అయితే బజాజ్ ఫైనాన్స్ మంచి ఆప్షన్.

Mahindra ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్
ఏడాది కాలపు షార్ట్ టర్మ్ పెట్టుబడికి మహీంద్రా ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మంచి మార్గం. వడ్డీ 7.95 శాతం వస్తుంది. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. వడ్డీ మొత్తం రూ.5,000 కంటే ఎక్కువ ఉంటే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ పైన టీడీఎస్ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు 0.10 శాతం అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ డిపాజిట్లు బజాజ్ ఫైనాన్స్ లాగే AAA రేట్ కలిగి ఉంది. కాబట్టి ఇవి సురక్షితమేనని చెప్పవచ్చు. స్వల్పకాలానికి దీనిని కూడా ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు.

వడ్డీ రేట్లు తగ్గింపు...
పైన పేర్కొన్న రెండు సేవింగ్స్ అకౌంట్స్ మినహా మిగతా వాటికి ట్యాక్స్ వర్తిస్తుంది. వీటిలోను వడ్డీపై పన్ను రేటుకు పరిమితి ఉంటుంది. చాలా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు కూడా సురక్షితమైనవి.. మంచి వడ్డీ రేట్లు అందించేవే. ఆర్థిక మందగనం నేపథ్యంలో అన్ని కూడా వడ్డీ రేట్లు తగ్గించాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్‌పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications