ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే 4 బెస్ట్ బ్యాంకింగ్ ఫండ్స్
ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడి పెడితే కనీసం అయిదేళ్ళ కాలపరిమితితో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే తక్కువ కాలంలోనే అంతకంటే (ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే మంచి రిటర్న్స్) వస్తే? డెట్ ఇన్స్టుమెంట్స్‌లలో బ్యాంకింగ్, PSU ఫండ్స్ సురక్షిత, తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రముఖ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్స్... ఫిక్స్డ్ డిపాజిట్స్, స్మాల్ సేవింగ్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) వంటి వాటి కంటే అధిక రిటర్న్స్ ఇస్తాయి. తక్కువ రిస్క్‌తో, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యం ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే అధిక రాబడిని పొందాలనుకుంటే 2021లో మీరు పెట్టుబడి పెట్టేందుకు నాలుగు ఉత్తమ బ్యాంకింగ్, పీఎస్‌యూ ఫండ్స్ ఇక్కడ చూడండి.

ఈ ఫండ్‌ను జనవరి 2013లో కొటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించింది. కొటక్ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఒక సంవత్సరపు రిటర్న్స్ 5.53 శాతంగా ఉంటుంది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున ప్రతి ఏడాదికి 8.90 శాతం రిటర్న్స్ అందించింది. ప్రముఖ సంస్థ వ్యాల్యూ రీసెర్చ్ దీనికి 4-స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో టాప్ 5 హోల్డింగ్స్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్ప్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉన్నాయి.

IDFC బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెబిట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
IDFC బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెబిట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్ 2013 ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. గత మూడు నుండి అయిదేళ్ల కాలంలో మంచి రిటర్న్స్ అందించింది. IDFC బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెబిట్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 1 ఇయర్ రిటర్న్స్ 5.07 శాతం. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున ప్రతి సంవత్సరం 8.53 శాతం రిటర్న్స్ అందించింది. ఫండ్స్ టాప్ 5 హోల్డింగ్స్‌లో యాక్సిస్ బ్యాంకు లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం, జీవోఐ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మంెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నాయి.

నిప్పోన్ ఇండియా బ్యాంకింగ్ & PSU ఫండ్‌ను 2015 మే నెలలో ప్రారంభించారు. గత ఏడాదిగా నిప్పోన్ ఇండియా బ్యాంకింగ్ & PSU ఫండ్ రిటర్న్స్ 5.26 శాతంగా ఉన్నాయి. వ్యాల్యూ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఏడాది సగటున 8.65 శాతం రిటర్న్స్ అందిస్తోంది.

యాక్సిస్ బ్యాంకింగ్ & PSU ఫండ్ డైరెక్ట్ గ్రోత్ వన్ ఇయర్ గ్రోత్ రేట్ 4.83 శాతంగా ఉంది. వ్యాల్యూ రీసెర్చ్ ప్రకారం వార్షిక సగటు రిటర్న్స్ 8.59 శాతంగా ఉన్నాయి. ఈ ఫండ్‌ను 2013 జనవరిలో యాక్సిస్ బ్యాంకు ప్రారంభించింది. ఫండ్ టాప్ 5 హోల్డింగ్స్‌లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications