ఈ 3 అదరగొట్టాయి: అప్పుడు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.61 లక్షలు చేతికి!

ఎస్ఎంఈలకు మద్దతు కోసం ఎక్స్చేంజ్ చురుకైన కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో ఈక్విటీ ఫైనాన్స్, లిస్టింగ్ ప్రయోజనాలపై ఎస్ఎంఈలకు అవగాహన కల్పించడానికి ఎక్స్చేంజ్ 150కి పైగా వెబినార్‌లను నిర్వహించింది. 2012 మార్చి నెలలో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. వ్యాపారాల వృద్ధి, విస్తరణ కోసం ఫైనాన్స్ కోరుకునే వారి కోసం ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. అప్పటి నుండి ఎస్ఎంఈ సెక్షన్ కింద 337 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి.

ఈ కంపెనీలు రూ.3500 కోట్ల మేర సమీకరించాయి. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,300 కోట్ల వరకు ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీల్లో దీర్ఘకాలికంగా స్టాక్స్ కలిగి ఉంటే అలాంటి ఈక్విటీలు ఇప్పుడు 1000 శాతం నుండి 5000 శాతం మధ్య రిటర్న్స్ అందించాయి. అంటే వారు ఇన్వెస్ట్ చేసిన దానికంటే వెయ్యి నుండి అయిదువేల రెట్ల ప్రయోజనం పొందుతారు. అలాంటి స్టాక్స్ కొన్ని...

ఆదిత్య విజన్ అదిరిపోయే రిటర్న్స్

ఆదిత్య విజన్ అదిరిపోయే రిటర్న్స్

ఆదిత్య విజన్ సంస్థ 1999లో ప్రారంభమైంది. రూ.920 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ఈ సంస్థ రిటైల్ రంగంలో స్మాల్ క్యాప్ బిజినెస్ కలిగి ఉంది. ఈ స్టాక్ కేవలం మూడేళ్లలోనే 1156.01 శాతం రిటర్న్స్‌ను అందించింది. అదే సమయంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 36.93 శాతం మాత్రమే లాభపడ్డాయి.

ఆదిత్య విజన్ సంస్థ లిస్ట్ అయినప్పుడు లాట్ సైజ్ 8000 బిజినెస్ షేర్లు. ధర రూ.15 మాత్రమే. అప్పుడు లాట్ కొనుగోలు చేస్తే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ.1.20 లక్షలు ((15x8000). ఇప్పుడు ఆ మొత్తం రూ.61.188 లక్షలకు చేరుకుంటుంది. మూడేళ్లలో 1100 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చిన ఈ సంస్థ ప్రారంభం నుండి 4899 శాతం రిటర్న్స్ అందించింది. గత ఏడాది కాలంలోనే 2996 శాతం లాభపడింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.727 వద్ద ఉంది.

రాఘవ్ ప్రోడక్టివిటీ ఎన్‌హాన్సర్స్

రాఘవ్ ప్రోడక్టివిటీ ఎన్‌హాన్సర్స్

రాఘవ్ ప్రోడక్టివిటీ ఎన్‌హాన్సర్స్2009లో ప్రారంభమైంది. ఇది మెటల్, నాన్ ఫెర్రాస్ రంగంలో స్మాల్ క్యాప్ బిజినెస్ వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.808.49 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ ఐపీవోకు వచ్చినప్పుడు ఈక్విటీ షేర్ రూ.39గా ఉంది. అప్పుడు లాట్ 3000. అప్పుడు ఒక లాట్ కొనుగోలు చేస్తే రూ.1,17,000 (39 x 3000) ఖర్చు చేశారు. ఈ కంపెనీ అయిదేళ్లలో రుణ రహిత సంస్థగా మారింది. ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్‌లో రూ.31 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.780 వద్ద ఉంది. ఈ కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి 2498 రెట్ల రిటర్న్స్ ఇచ్చింది. గత ఏడాది కాలంలో 578 శాతం రిటర్న్స్ అందించింది. ప్రారంభంలో రూ.1.17 లక్షలు పెట్టు ఈ స్టాక్ లాట్ కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు రూ.22.30 లక్షలు వస్తాయి.

శ్రీగణేష్ రెమెడీస్

శ్రీగణేష్ రెమెడీస్

శ్రీగణేష్ రెమెడీస్ కంపెనీ 1995లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ ధర రూ.358 వద్ద ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.352.88 కోట్లు. ఇటీవలి త్రైమాసికంలో ఈ కంపెనీ గ్రాస్ సేల్స్ రూ.584.26 కోట్లు, మొత్తం ఆదాయం రూ.626.04 కోట్లుగా నమోదయింది. ఈ కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి 1110 శాతం రిటర్న్స్ అందించింది. అప్పుడు రూ.1.08 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారి చేతికి ఇప్పుడు రూ.9.91 లక్షలు వస్తాయి. ఏడాది కాలంలో ఈ కంపనీ 273 శాతం లాభపడింది.

స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఇన్వెస్ట్ చేయడానికి ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాగే స్టాక్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+