భారత స్టాక్ మార్కెట్లో 3500కు పైగా స్టాక్స్ యాక్టివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే గత అయిదేళ్ల కాలంలో ప్రతి సంవత్సరం 23 స్టాక్స్ మాత్రం 15 శాతం రిటర్న్స్‌తో ఇన్వెస్టర్లను మురిపించాయి. ఈ కాంపౌండెడ్ బేస్‌లో గత ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో వీటిలో 5 స్టాక్స్ ప్రతి ఏడాది 30 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, అవెన్యూ సూపర్ మార్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ వంటివి ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. పూర్తి అవగాహనతో, నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

ఈ స్టాక్స్ అదుర్స్
బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ప్రస్తుతం రూ.7280 వద్ద ఉంది. ఈ స్టాక్ 2021లో 32 శాతం, 2020లో 25 శాతం, 2019లో 59 శాతం, 2018లో 53 శాతం, 2017లో 108 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
ఏషియన్ పేయింట్స్ స్టాక్ ప్రస్తుతం రూ.3435 వద్ద ఉంది. ఈ స్టాక్ 2021లో 21.88 శాతం, 2020లో 54 శాతం, 2019లో 30 శాతం, 2018లో 20 శాతం, 2017లో 30 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
డిమార్ట్ స్టాక్ ప్రస్తుతం రూ.4748 వద్ద ఉంది. ఈ స్టాక్ 2021లో 97 శాతం, 2020లో 51 శాతం, 2019లో 15 శాతం, 2018లో 37 శాతం, 2017లో 295 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ప్రస్తుతం రూ.1714 వద్ద ఉంది. ఈ స్టాక్ 2021లో 248 శాతం, 2020లో 130 శాతం, 2019లో 32 శాతం, 2018లో 56 శాతం, 2017లో 117 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

100 శాతం నుండి 200 శాతం రిటర్న్స్
పైవాటితో పాటు పిడిలైట్ ఇండస్ట్రీస్, దివిస్ ల్యాబ్స్, జుబిలాంట్ ఫుడ్ వర్క్స్, అస్త్రాల్, అబోట్ ఇండియా, వరున్ బీవరేజెస్, ఆర్తి ఇండస్, కోఫోర్జ్, అతుల్, వినతి ఆర్గానిక్స్, ఆల్కైల్ అమైన్స్, జీఎంఎం ఫడ్లర్, అపోలో ట్రైకోట్ వంటివి కూడా ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో కొన్ని ఒక్కో సంవత్సరం 100 శాతం కంటే పైగా రిటర్న్స్ ఇచ్చాయి. 200 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి.

2021లో ఈ మిడ్, స్మాల్ అదుర్స్
2021 క్యాలెండర్ ఏడాదిలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా లాభపడ్డాయి. ఇవి ఇన్వెస్టర్లకు సంపదను కురిపించాయి. దిగ్గజ కంపెనీలు టెక్ మహీంద్రా 85 శాతం, విప్రో 84.88 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 81.68 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.
అదే సమయంలో బీఎస్ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ 349 శాతం, ఐఆర్సీటీసీ 189 శాతం, టాటా పవర్ 188 శాతం, ఎంఫయాసిస్ 117 శాతం, అపోలో హాస్పిటల్స్ 106 శాతం, అదానీ పవర్ 100 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.
స్మాల్ క్యాప్స్‌లో టాటా టెలీ సర్వీసెస్ 2373 శాతం, బ్రైట్ కామ్ గ్రూప్ 2063 శాతం, ఆరమ్ ప్రాప్ టెక్ 901 శాతం, రతన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ 604 శాతం, గణేష్ హౌసింగ్ కార్పోరేషన్ 656 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.


Click it and Unblock the Notifications