ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలే లాభాలు.. ప్రతి డిసెంబర్‌లో 'డబుల్' గ్యారంటీ!
ప్రస్తుతం మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు వివిధ రంగాల సేల్స్ తగ్గిపోయాయి. అన్ని రంగాలు బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 4సార్లు ఉద్దీపన ప్రకటనలు చేసింది. ఇలా ప్రకటించిన సందర్భాల్లో మార్కెట్లు జోష్ అందుకోవడం, ఆ తర్వాత వెనక్కి వెళ్లడం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలనే దానిపై కొంతమంది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఉదాహరణకు యస్ బ్యాంకు షేర్ దూకుడుపై కనిపించి హఠాత్తుగా సగానికి పైగా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెట్టర్ అనేది క్వశ్చన్ మార్క్‌గా మారింది.

డబుల్ డిజిట్ గ్రోత్‌తో ఈ 10 స్టాక్స్
ఇక్కడ కొన్ని స్టాక్స్ గత కొన్నేళ్లుగా ప్రతి అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్‌లో లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇది అసలే పండుగ సీజన్. ఈ సమయంలో కొన్ని షేర్లు మంచి లాభాలను మూటగట్టుకుంటున్నాయి. 10 వరకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ స్టాక్స్ ప్రతి డిసెంబర్ క్వార్టర్లో 10 శాతానికి పైగా రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది నిపుణుల సలహాలు తీసుకొని చేస్తే బెట్టర్.

అయిదేళ్లుగా డిసెంబర్ క్వార్టర్లో లాభాల్లో ఈ స్టాక్స్
ఆక్స్‌టెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సెన్‌లబ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డీ అండ్ హెచ్ ఇండియా లిమిటెడ్, కిలిట్చ్ డ్రగ్స్ ఇండియా, మంగళం ఆర్గానిక్స్, ప్రదీప్ మెటల్ లిమిటెడ్, ప్రితీష్ నందీ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రుత్తోన్షా ఇంటర్నేషనల్, స్కూటర్స్ ఇండియా, ఉర్జా గ్లోబల్.. ఈ పది స్టాక్స్ గత అయిదేళ్లుగా డిసెంబర్ క్వార్టర్‌లో వరుసగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ షేర్లు 2014 నుంచి 2018 వరకు డిసెంబర్ క్వార్టర్లో 10 శాతం నుంచి 80 శాతానికి పైగా రిటర్న్స్ తీసుకు వచ్చాయి.

సీజనల్ స్టాక్స్..
ప్రస్తుత పరిస్థితుల్లో గత అయిదేళ్లుగా దూకుడు మీద ఉన్న ఈ స్టాక్స్‌లలో నిపుణుల సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెట్టర్. ఈ సీజన్‌లో ఈ స్టాక్స్ పెరగడానికి సీజన్ ఫ్యాక్టర్ పెద్ద కారణంగా భావిస్తున్నారు.

మంచి తీరు కనబరచవచ్చు..
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా స్టాక్స్ ఊగిసలాటలో ఉన్నాయని, ర్యాలీ కొనసాగుతుందని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. వీటిల్లో ఒకటి రెండు మినహా సీజనల్, ప్రైస్ సస్టెనబులిటీ కలిగినవని చెబుతున్నారు. థియోర్టికల్‌గా, మంచి నిర్వహణ, బలమైన ఆర్డర్ పుస్తకం ఉన్న స్టాక్స్ మార్కెట్‌ను అధిగమిస్తాయని, దీనిని పరిగణలోకి తీసుకుంటే పైన పేర్కొన్న స్టాక్స్ మంచి తీరు కనబరచవచ్చునని అంటున్నారు.

మార్కెట్లకు ఊతం...
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లతో పాటు భారత మార్కెట్లు ఆశాజనకంగా లేవు. దీంతో మోడీ ప్రభుత్వం ఉద్దీపన ప్రకటనలు చేసింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. బ్యాంకులు లోన్ మేళాలు నిర్వహిస్తున్నాయి. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నారు. దీంతో రుణాలు రేటును పెంచనున్నారు. ఇవి మార్కెట్లకు ఊతమిస్తాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications