పర్సనల్ లోన్స్ అంటే ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులు ఇతర ఆర్ధిక సంస్థలు ఇచ్చే రుణాలు. అందుకే బ్యాంకులు ఇలాంటి రుణంపై అధిక వడ్డీని వసూలు చేస్తుంటాయి. పర్సనల్ లోన్ ను ఉద్యోగం చేస్తున్న వారు, ఉద్యోగం చేయని వారు కూడా తీసుకోవచ్చు. అయితే వీరికి ఇచ్చే వడ్డీ రేటులో తేడా ఉంటుంది. తక్షణ అవసరాలు, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్స్ తీసుకుంటుంటారు. వీటిని చాలా తక్కువ సమయంలోనే పొందవచ్చు. అయితే ఇక్కడ ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం వడ్డీ రేటు. వడ్డీ గురించి పట్టించుకోకుండా రుణం తీసుకుంటే మాత్రం ఆ భారం చాలా ఎక్కువ అయిపోయి రుణ ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంటుంది.

ఎప్పుడు ఈ రుణం తీసుకోవాలంటే...
* ఎక్కడా డబ్బులు దొరకని పరిస్థితిలో పర్సనల్ లోన్ పై దృష్టిపెట్టాలి. తక్షణం డబ్బు అవసరం ఉండి ఇతరుల వద్ద నుంచి సర్దుబాటు కానప్పుడు పర్సనల్ లోన్ ను ఎంచుకోవచ్చు.
* తక్కువ కాల పరిమితికి రుణం కావాలనుకున్నప్పుడు, రుణ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుందనుకున్నప్పుడు లేదా హామీగా ఏదైనా ఆస్థి లేనప్పుడు.
* ఏవైనా గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లేదా విహార యాత్రలకు పర్సనల్ లోన్ తీసుకోక పోవడం మంచిది.
* వ్యక్తిగత రుణం తీసుకోవాలను కున్నప్పుడు ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు అడిగినా లేదా అడ్వాన్స్ గా వాయిదాను చెల్లించమని కోరినా అలాంటి లోన్ జోలికి వెళ్ళవద్దు.
* అవసరం మేరకు మాత్రమే రుణం తీసుకోవడం మంచిది. ఎక్కువ మొత్తం రుణం ఇస్తామని చెప్పినప్పటికీ మీ అవసరానికి అనుగుణంగా రుణం తీసుకోండి. అప్పు దొరుకుతుందని తీసుకుంటే తిరిగి చెల్లించే సమయంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు...
* బ్యాంకులు వ్యక్తి గత రుణాలపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయని ముందే అనుకున్నాం కదా. ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తోందంటే..
ఎస్బీఐ...
* స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా రూ. 20 లక్షల వరకు రుణం ఇస్తోంది. గరిష్టంగా ఆరేళ్ళ కాలానికి రుణం పొందవచ్చు. వడ్డీ రేటు 10.55 శాతం నుంచి 14.95 శాతం వరకు ఉండగా ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతం వరకు ఉంది.

హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్
* ఈ బ్యాంకు రూ.50,000 నుంచి రూ. 40 లక్షల వరకు రుణం అందిస్తోంది. గరిష్టంగా ఐదేళ్ల కాలానికి రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు 10.75 శాతం నుంచి 21.3 శాతం వరకు ఉంది. రుణం పై ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం వరకు వసూలు చేస్తోంది.

ఐసిఐసిఐ బ్యాంక్
* ఈ బ్యాంకు గరిష్టంగా ఐదేళ్ల కాలానికి రూ.50,000 నుంచి 20 లక్షల వరకు రుణం ఇస్తోంది. వడ్డీ రేటు 11.25 శాతం నుంచి 22 శాతం వరకు ఉండగా ప్రాసెసింగ్ ఫీజు 2.25 శాతం వరకు ఉంది.
* యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేటు 12 శాతం నుంచి 24 శాతం వరకు, సిటీ బ్యాంక్ వడ్డీ రేటు 10.5 శాతం నుంచి 18. 99 శాతం వరకు, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వడ్డీ రేటు 10.1 శాతం నుంచి 14.2 శాతం వరకు ఉంది.
* ఏ బ్యాంకు నుంచి పెర్సనల్ లోన్ తీసుకోవాలను కున్నప్పుడు వడ్డీ రేటు ఎంత ఉందొ చూసుకోవడం మరవద్దు. ఈ వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు. మీరు రుణం తీసుకున్న ముందు ఇతర బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఇస్తున్నాయి చూసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు కూడా ముఖ్యమే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications